కంగనాకు అక్కడా దెబ్బడిపోయిందే
కంగనా ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే ఏదైతే సోషల్ మీడియాలో హంగామా చేస్తూంటుందో అక్కడే ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మతసామరస్యం దెబ్బతినేలా పోస్టులు పెడుతోందనే కారణంతో ట్విట్టర్ వేదికనుంచి ఆమెని బహిష్కరించింది. ట్విట్టర్ ఆమె అకౌంట్ ని శాశ్వతంగా సస్పెండ్ చేసేసింది. దాంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ కి షిప్ట్ అయ్యి.... అక్కడ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. ఐతే, అక్కడ కూడా ఆమెకి షాక్ తగిలింది.
రీసెంట్ గా కంగనాకి కరోనా సోకింది. ఆ విషయాన్ని తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఐతే, ఆందులో ఆమె రాసిన కంటెంట్ పై చాలామంది అభ్యంతరం ప్రకటించారు. దాంతో, ఇన్ స్టాగ్రామ్ ఆమె పెట్టిన పోస్ట్ ని డిలిట్ చేసింది. అయితే ట్విట్టర్ లా ఇన్ స్టాగ్రామ్ ఆమెని బహిష్కరించి,నిషేధం పెట్టలేదు కానీ ఆమె పెట్టిన పోస్ట్ ని తొలగించింది. ఇంతకీ ఆమె ఏం రాసిందంటే..
‘‘కొన్ని రోజులుగా కొంచెం నీరసంగా, కళ్లలో మంటగా ఉంటుంది. నేను హిమాచల్ వెళ్తామని అనుకున్నాను. కాబట్టి నేను టెస్ట్ చేయించుకుంటే.. అందులో రిపోర్టు పాజిటివ్ అని వచ్చింది. కాబట్టి నేను క్వారంటైన్‌లోకి వెళ్లాను. నా బాడీలో వైరస్ పార్టీ చేసుకుంటుందనే విషయం నాకు తెలియదు. కానీ, నేను దాన్ని నాశనం చేస్తాను. మీరు ఎంత భయపడితే.. అది మిమ్మల్ని మరింతగా భయపెడుతుంది. దానిపై మనం కలిసి పోరాటం చేయాలి. కోవిడ్-19 అనేది ఒక చిన్న ఫ్లూ మాత్రమే.. అందరి మనస్తత్వంతో ఆడుకుంటుంది.. దాన్ని అణిచేయాలి’’ అంటూ కంగనా పోస్ట్ చేసింది.
ఇంతకీ ఆమె రాసిన దాంట్లో అభ్యంతరకరమైన విషయం ఏంటంటే…. “కరోనా ఫ్లూ లాంటి చిన్న రోగం. మీడియా ఎక్కువ ప్రచారం చేసి భయపెడుతోంది.”. ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందిపడుతూ మరణిస్తూంటే...చిన్న రోగం అనటం అభ్యంతరకమైన విషయమే కదా. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'తలైవి' సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ అండ్ టీజర్‌లు విడుదలై... మంచి ఆదరణ పొందాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాను ఎ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారంఈ నెల 23న తమిళం, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా.. సినిమా విడుదలను వాయిదా వేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.