• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఇండియన్ 2'కి మరో కష్టం...

'ఇండియన్ 2'కి మరో కష్టం వచ్చిపడిందే!

By - Tupaki Desk
Update: 2021-09-20 02:30 GMT
కర్ణుడి చావుకు ఆరుగురు కారణం అంటారు .. కానీ ఒక సినిమా ఆగిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఆ కారణాల సంఖ్య పెరుగుతూ పోతున్నప్పుడు మాత్రం, ఇక ఆ సినిమా ఇప్పట్లో పూర్తికాదనే విషయం మరింత బలపడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు 'ఇండియన్ 2' సినిమా ఉంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారీ సినిమాలలో ... ఆయన అందుకున్న భారీ విజయాలలో 'ఇండియన్' ఒకటిగా కనిపిస్తుంది. 1996లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయానికి అసలైన అర్థం చెప్పింది.

తెలుగులో 'భారతీయుడు' టైటిల్ తో విడుదలైన ఈ సినిమా, ఇక్కడి ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేసింది. కమల్ చేసిన ద్విపాత్రాభినయం .. ఆ పాత్రల మధ్య గల వైవిధ్యం .. శంకర్ టేకింగ్ .. రెహ్మాన్ సంగీతం .. ఇలా అన్ని అంశాలు అద్భుతంగా కుదిరిన సినిమాగా 'భారతీయుడు' నిలిచింది. ప్రతి భారతీయుడి మనసును గెలిచింది.  అలాంటి  ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి శంకర్ రంగంలోకి దిగాడు. కావలసినంత ఖర్చు చేయడానికి లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు వచ్చారు. చాలా వేగంగానే 'ఇండియన్ 2' ప్రాజెక్టును పట్టాలెక్కించారు.

షూటింగు మొద్దలైన తరువాత దర్శక నిర్మాతల మధ్య వచ్చిన మనస్పర్థాలు .. షూటింగు సమయంలో జరిగిన ప్రమాదం .. కరోనా తెచ్చిన గ్యాప్ .. ఇలా ఎన్నో కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. నిర్మాతలతో వ్యవహారం తెగకపోవడంతో, చరణ్ తో  సినిమాను ప్లాన్ చేసుకుని శంకర్ ముందుకు వెళుతున్నాడు. దాంతో కమల్ కూడా సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమా చేసుకుంటూ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే 'ఇండియన్ 2'లో కథానాయికగా చేస్తున్న కాజల్ ప్రెగ్నెంట్ అనే టాక్ తాజాగా బయటికి వచ్చింది.

ఈ కారణంగా ఏడాదికి పైగా ఆమె షూటింగులో పాల్గొనే అవకాశమే ఉండదని చెప్పుకుంటున్నారు. అసలు ఆ తరువాతైనా కాజల్ ఈ సినిమా చేస్తుందా? అనే డౌట్ కూడా లేకపోలేదు. అంచలంచెలుగా వచ్చి పడుతున్న ఈ అవాంతరాలను దాటుకుని 'ఇండియన్ 2' ఎప్పుడు బయటపడతాడో చూడాలి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.     
Tags:    
  • Indian 2 
  • Kamal Haasan 
  • Kollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS