తొలి భారతీయ ఆస్కార్ విజేత భాను అథియా ఇకలేరు
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, ఇండియా తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత భాను అథియా (91) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న భాను గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆమె కుమార్తె రాధిక గుప్తా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఎనిమిదేళ్ల క్రితం ఆమె మెదడులో ఓ కణతి ఏర్పడింది. గత మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో భాను అథియా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1982లో గాంధీ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె ఆస్కార్ అందుకున్నారు. భాను అథియా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించారు. ఆమె చాలా కాలంపాటు జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఈవ్స్ వీక్లీ సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఆమె ఆర్టికల్స్ రాసేవారు.
తొలిసారిగా ఓ పత్రిక ఎడిటర్ కోరిక మేరకు దుస్తులను డిజైన్ చేశారు. తర్వాత క్రమంగా ఆమె ఈ వృత్తిలో రాణించారు. 1956లో విడుదలైన సీఐడీ చిత్రానికి తొలిసారి క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఆ తర్వాత పాయసా (1957), చౌద్విన్ కా చాంద్ (1960) సాహిబ్ బీబీ ఔర్ గులాం (1962) చిత్రాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేశారు. లగాన్ (2002) చిత్రానికి రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. 50 సంవత్సరాల కెరీర్లో 100 చిత్రాలకు ఆమె దుస్తులను రూపొందించారు. తన మరణం తరువాత తన కుటుంబం ట్రోఫీని జాగ్రత్తగా చూసుకోలేదని భావించి తన అకాడమీ అవార్డును ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.15 డిసెంబర్ 2012 న, ట్రోఫీని అకాడమీకి తిరిగి ఇచ్చారు. అంతేకాదు ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు.