పెద్ద సినిమాలు తప్పుకుంటే చిన్న సినిమాలదే పెద్ద రోల్!
కరోనా మహమ్మారీ సెకండ్ వేవ్ ప్రభావంతో చాలా పెద్ద సినిమాల రిలీజ్ లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాల్లో ప్లాన్ చేసుకున్నవేవీ రిలీజ్ కాకపోవడంతో థియేటర్లలోకి వరుసగా చిన్న సినిమాలు రిలీజవుతున్నాయి. ఏప్రిల్ - మే సీజన్ కి చిన్న సినిమాలే థియేటర్లకు పెద్ద అండగా మారుతున్నాయి.
ఇందులో నవతరం హీరోలు నటించిన సినిమాలు ఉన్నాయి. వీటిలో సందీప్ కిషన్ గల్లీ రౌడీ మేలో విడుదలవుతుంది. ఓ బేబి ఫేం తేజా సజ్జా నటించిన `ఇష్క్` ఏప్రిల్ 23 విడుదల కానుంది. విశ్వక్ సేన్ పాగల్ ప్రణాళిక ప్రకారం విడుదలయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ఏప్రిల్ -మే సీజన్ లో విడుదల కోసం అనేక చిన్న సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మునుముందు వీటికి సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయి.
కంటెంట్ ఆకట్టుకుంటే చిన్న సినిమానే ఇప్పుడు పెద్ద సినిమా. పెద్ద హీరోల సినిమాలేవీ లేవు కాబట్టి బాగా ఆడేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే అన్ని సినిమాలకు ప్రైమ్ ఏరియాల్లో థియేటర్లు దొరుకుతాయి. సినిమా బావుంటే జనం కరోనాకి భయపడరని పలు చిత్రాలు నిరూపించాయి. క్రాక్ మొదలు మొన్న జాతిరత్నాలు.. ఉప్పెన వరకూ ప్రతిదీ నిరూపించాయి. వకీల్ సాబ్ పెద్ద సినిమా అయినా గొప్ప కంటెంట్ ఉన్న సినిమాగా మెప్పు పొందింది. కరోనాతో సహజీవనం చేయాల్సిన ఈ రోజుల్లో ఎన్ని భయాలు ఉన్నా జనం థియేటర్లకు వస్తున్నారని ప్రూవైంది. ఇకపై థియేటర్లలో నియమనిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే ప్రతిదీ కంట్రోల్ చేయడం కుదురుతుందని విశ్లేషిస్తున్నారు. సరైన కంటెంట్ తో ఈ సీజన్ లో రిలీజ్ కొచ్చేవి హిట్లు కొడతాయనే ఆశిద్దాం.