• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR: దేవ‌గ‌న్ నో చెబితే...

RRR: దేవ‌గ‌న్ నో చెబితే కిలాడీని దువ్వాడు!

By - Tupaki Desk
Update: 2019-02-10 07:41 GMT
అజ‌య్ దేవ‌గ‌న్ లాస్ .. కిలాడీ అక్షయ్ కుమార్ కి గెయిన్ కాబోతోందా? దేవ‌గ‌న్ కాద‌నుకున్న ఓ క్రేజీ ఆఫ‌ర్ ని కిలాడీ అక్ష‌య్ ల‌ట‌క్కున క్యాచ్ చేశారా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇండియా నంబ‌ర్ 1 డైరెక్ట‌ర్.. బాహుబ‌లి ఫేం ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఆఫ‌ర్ చేసిన పాత్ర‌ను కాద‌నుకుని దేవ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని, సేమ్ టైమ్ కిలాడీకి అది క‌లిసొచ్చింద‌ని ఓ కొత్త టాక్ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అస‌లింత‌కీ ఈ ప్ర‌చారంలో నిజం ఎంత‌? అబ‌ద్ధం ఎంత‌? అన్న‌ది తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

ది గ్రేట్ ఎస్.ఎస్.రాజ‌మౌళి ప్ర‌స్తుతం RRR లాంటి భారీ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఈ చిత్రంలో క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌ధాన విల‌న్ ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ స‌స్పెన్స్. ఓవైపు రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే రాజ‌మౌళి ప‌లువురు విల‌న్ల‌ పేర్ల‌ను ప‌రిశీలించార‌ట‌. అందులో తొలిగా బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ఓ ఆప్ష‌న్ అని తెలుస్తోంది.  రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఈగ` చిత్రానికి హిందీ వెర్ష‌న్ డ‌బ్బింగ్ చెప్పారు దేవ‌గ‌న్ - కాజోల్ జంట‌. ఆ చొర‌వ‌తోనే అజ‌య్ దేవ‌గ‌న్ ని రాజ‌మౌళి సంప్ర‌దించార‌ట‌. ఆర్.ఆర్.ఆర్ లో కీల‌క పాత్ర‌లో న‌టించాల్సిందిగా కోరార‌ట‌. అయితే  దేవ‌గ‌న్ ఆ ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించార‌ని తెలుస్తోంది.

అతడు ఆ ఆఫ‌ర్ ని కాద‌నుకోగానే రాజ‌మౌళి వెంట‌నే కిలాడీ అక్ష‌య్ ని సంప్ర‌దించార‌ని, అయితే ఇంకా ఇది చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ అక్ష‌య్ ఈ సినిమాని అంగీక‌రిస్తే అత‌డు సెలెక్ట్ చేసుకున్న రెండో అతిపెద్ద సౌత్ సినిమా అవుతుంది. శంక‌ర్ 2.0 త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ అక్కీకి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక అజ‌య్ దేవ‌గ‌న్ ఇదివ‌ర‌కూ `భార‌తీయుడు 2` ఆఫ‌ర్ ని కాద‌నుకున్నారు. దాదాపు 300కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఆర్.ఆర్.ఆర్ ను కాద‌నుకోవ‌డంతో రెండోసారి క్రేజీ ఆఫ‌ర్ ని కోల్పోయార‌ని విశ్లేష‌ణ సాగుతోంది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత టైమ్స్ న‌వ్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించ‌డం సంచ‌ల‌న‌మైంది. అలాగే ఈ చిత్రంలో క‌థానాయిక‌ల్ని ఎంపిక చేయాల్సి ఉంది. బాలీవుడ్ భామలు జాన్వీ, ఆలియా, ప‌రిణీతి వంటి నాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.
Tags:    
  • Akshay Kumar 
  • Rajamouli 
  • Ajay Devgn 
  • RRR Movie 
  • Latest News 

Similar News

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

Copyright @2026

Powered by Blink CMS