ఫస్ట్ లుక్: కొత్తగా ట్రయ్ చేస్తున్నాడు
టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా హీరోగా కొనసాగుతున్నా సుమంత్ కు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకానొక దశలో బాగానే ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ దానిని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోవడంతో స్టార్ హీరో అవలేక పోయాడు.
కొంతకాలంపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సుమంత్ ఈమధ్య నరుడా.. డోనరుడా సినిమాతో తిరిగి తెర ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీరావా సినిమాకు రిలీజ్ కు ముందు బజ్ బాగానే వచ్చింది. కానీ స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగడంతో ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ యూత్ ను ఆకట్టుకోలేదు. తాజాగా సుమంత్ ఇదం జగత్ అనే కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే సుమంత్ ఏదో కొత్తగా ట్రయ్ చేస్తున్నట్టే అనిపించింది. మెయిన్ రోడ్ పై తలలేని ఓ మొండాన్ని వీడియో తీస్తున్న జర్నలిస్ట్ గా సుమంత్ లుక్ ఆకట్టుకునేలా కనిపించింది.
విరాట్ ఫిలింస్ - శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో ఇదం జగత్ సినిమా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠం ఈ మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. కొత్త డైరెక్టర్లు మంచి కాన్సెప్టులతో వస్తున్నా వాటిని తెరమీద ఆకట్టుకునేలా ప్రజెంట్ చేయడంలో ఫెయిలవుతున్నారు. మరి ఈ డైరెక్టరయినా సుమంత్ ఆశ నెరవేరుస్తాడా వెయిట్ అండ్ సీ