కమల్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు

Update: 2020-05-25 06:30 GMT
ఇండియన్ స్టార్ యాక్టర్ కమల్ హాసన్ ఎల్లప్పుడూ ఏదొక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసే సినిమాలు ఏడాదికి ఒకటో లేక రెండేళ్లకు ఒకటో విడుదల అవుతుంటాయి. కానీ ఆయనకు సంబంధించిన వివాదాలు మాత్రం వారానికి ఒకటైన వార్తలలో కనిపిస్తుంటాయి. కమల్ హాసన్ ఎంత స్టార్ హీరోనో అంతే రొమాంటిక్ హీరో అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే ఆరు పదుల వయసు నిండినా ఆయన సినిమాలలో మినిమమ్ ఘాటు సన్నివేశాలు మెయింటైన్ చేస్తారు. కానీ అలాంటి ఘాటు సన్నివేశాలే ఒక్కోసారి తంటాలు తెచ్చి పెడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి తంటానే హీరోయిన్ పూజాకుమార్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కమల్ హాసన్ సినీ జీవితంలో ఎంతటి స్టారో వేరే చెప్పక్కర్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. కమల్ హాసన్ గతంలో పుట్టినరోజును తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఆ వేడుకలో కమల్ కుటుంబంతో పాటు హీరోయిన్ పూజా కుమార్ కూడా కనిపించింది. అంతేగాక.. బర్త్ డే ఏర్పాట్లన్నీ తనే స్వయంగా చేస్తున్నట్లు కనిపించింది.

దీనితో మళ్లీ చర్చ మొదలైంది. పూజా కుమార్ - కమల్ హాసన్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని వివాదం చెలరేగింది. ఇక వీరిద్దరి మధ్య నడుస్తున్న పుకార్ల పై పూజా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. "నేను గత ఐదారేళ్లుగా కమల్‌ సార్ తో కలిసి పని చేస్తున్నాను. ఆయన ఓ గొప్ప క్రియేటర్ అండ్ ఓ మెస్మరైజర్. ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. నిజానికి నాకు ఓపికతో ఉండటం ఎలాగో నేర్పించింది ఆయనే. నాకు కమల్ తో పాటు వారి ఫ్యామిలీ మెంబెర్స్.. బ్రదర్స్.. కూతుర్లు అందరూ బాగా పరిచయం. కానీ ప్రస్తుతం వస్తున్న పుకార్లు చూస్తుంటే.. నేనేదో కమల్ సార్ భార్య ప్లేస్ భర్తీ చేయనున్నట్లు అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నాకు ఆయన కుటుంబం.. కుటుంబ సభ్యులు బాగా తెలుసు.. అందరితో బాగా మాట్లాడతాను అంతే. ఆయన నుంచి నేను చాలా నేర్చుకుంటున్నా.. ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు" అంటూ చెప్పింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కమల్ ఇండియన్ 2లో నటిస్తున్నారు. ఇక పూజా ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పటికైనా జనాలు వీరిద్దరి పై క్లారిటీతో ఉంటారేమో!
Tags:    

Similar News