వివాదంపై స్పందించిన హైపర్ ఆది

Update: 2021-06-15 11:05 GMT
బతుకమ్మ పాటను అవమానించినట్టు వస్తున్న వార్తలపై హైపర్ ఆది స్పందించారు. బతుకమ్మ పాటపై తాను అన్నట్టుగా వస్తున్న మాటలు ఎడిటింగ్ లో చేసిన లోపం అని.. కావాలని అన్నది కాదని హైపర్ ఆది వివరణ ఇచ్చారు. తాను తప్పుగా మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదని హైపర్ ఆది వివరణ ఇచ్చారు.

స్కిట్ లో భాగంగా ఎవరో బతుకమ్మ పాట స్ట్రాట్ చేశారని.. తాను కేవలం అనుసరించానని.. తప్పుడు మాటలు మాట్లాడలేదని హైపర్ ఆది వివరణ ఇచ్చారు. తాను అన్న పదాన్ని ఎడిటింగ్ లో కట్ చేశారని ఆది తెలిపారు.

ఇక తెలంగాణ జాగృతి స్టూడెంట్స్ మాత్రం దీనిపై ఫైర్ అయ్యారు. హైపర్ ఆది క్షమాపణ చెప్పకపోతే అతడిని హైదరాబాద్ లో అడ్డుకుంటామని.. తిరగలేకుండా చేస్తామని ఆది పేర్కొన్నారు.

ఒక న్యూస్ చానెల్ జాగృతి నాయకులతో హైపర్ ఆదిని ఫోన్ ద్వారా మాట్లాడించింది. ఈ సందర్భంగా తనకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలుసు అని.. వాటిపై నోరుజారలేదని వివరణ ఇచ్చారు. ఎడిటింగ్ లోపం వల్లే అలా జరిగిందన్నాడు. తాను తప్పు మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.  
Read more!

తెలంగాణ భాష, యాసను అవమానిస్తూ మాట్లాడాడంటూ హైపర్ ఆదిపై ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు.

జూన్ 12న ఓ ప్రముఖ టీవీ చానెల్ లో ప్రసారమైన కార్యక్రమంలో తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాషను కించపరిచేలా స్కిట్ ప్రదర్శించాడని హైపర్ ఆదిపై ఫిర్యాదులో పేర్కొన్నారు.

Full View



Tags:    

Similar News