ట్రెండీ టాక్ : హైదరాబాద్ స్టూడియోలే టార్గెట్
గత పది నెలల నుండి షూటింగులు లేకపోవడంతో ఫిల్మ్ స్టూడియోలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సినీజనం చాలా నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని స్టూడియోలు దీనికి మినహాయింపు కాదు. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి వెంటనే మలుపు తిరిగింది.
అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం గుడ్ టైమ్ నడుస్తోంది. హైదరాబాద్ లోని స్టూడియోలు చాలా బిజీగా మారాయి. టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషా చిత్రాలు కూడా ఇక్కడ చిత్రీకరణలతో బిజీ వాతావరణం కనిపిస్తోంది. బహిరంగ షూటింగులు చాలా కష్టంగా మారుతున్న సమయంలో చిన్న స్టూడియోలు సరిపోవు అని భావిస్తే.. భారీ చిత్రాల కోసం అగ్ర నిర్మాతలు హైదరాబాద్ లో పాపులర్ సినిమా స్టూడియోలను ఎంచుకుంటున్నారు.
ఇక రామోజీ ఫిల్మ్ సిటీకి డిమాండ్ అమాతం పెరిగింది. ఇప్పటికే బుకింగులతో స్టూడియో ఫుల్ బిజీగా ఉందని వర్గాలు చెబుతున్నాయి. తాజా నివేదిక ప్రకారం.. ఆర్.ఎఫ్.సీలో పూర్తి స్థాయిలో షూటింగులు జరుగుతున్నాయి. అమితాబ్ బచ్చన్ -అజయ్ దేవ్‌గన్ తారలుగా `మే డే` ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రజనీకాంత్ `అన్నాథే` చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చారు. సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం బృందం త్వరలో హైదరాబాద్ చేరుకోనుంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ `ఫాంటమ్` బృందం కూడా హైదరాబాద్ లో షూట్ చేయనుంది. ఈ సినిమా షూటింగ్‌లకు ఆర్‌ఎఫ్‌సి హబ్ గా మారింది.
అలాగే చాలా పెద్ద తెలుగు చిత్రాలు కూడా రామోజీఫిలింసిటీలో తెరకెక్కుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్.. రామానాయుడు స్టూడియోస్.. సారథి స్టూడియోస్ నిరంతరం షూటింగులతో బిజీగా ఉన్నాయని సమాచారం.