విడుదలైన కొన్ని గంటల్లోనే 'నిశబ్దం'కు షాక్‌

Update: 2020-10-03 04:15 GMT
అనుష్క.. మాధవన్‌..  అంజలి.. షాలిని పాండే కీలక పాత్రల్లో నటించిన నిశబ్దం సినిమా సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత నిన్న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో అనుష్క మూగ చెవిటి అమ్మాయి పాత్రలో నటిస్తున్న కారణంగా అంచనాలు మొదటి నుండి కూడా భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ ఈ సినిమాను రూపొందించారంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ సమయంలో చెప్పుకొచ్చారు. దాంతో సినిమాపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న విడుదలైన ఈ సినిమా అప్పుడే పైరసీ అయ్యింది.

థియేటర్లకు పెద్ద శాపంగా మారిన పైరసి ఇప్పుడు ఓటీటీకి కూడా తలనొప్పిగా మారింది. నిన్న అర్థరాత్రి సమయంలో విడుదలైన నిశబ్దం సినిమాను తెల్లవారే సరికి ఆన్‌ లైన్‌ లో రాకర్స్‌ ఉంచేశారు. ఇది అమెజాన్‌ ప్రైమ్‌ వారికి మరియు చిత్ర యూనిట్‌ సభ్యులకు పెద్ద దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం లేని వారు ఇప్పుడు పైరసీని చూసేందుకు ఆసక్తి చూపించారు.

పైరసీ కూడా హెడ్‌ డీ ప్రింట్‌ అవ్వడంతో ప్రేక్షకులు అమెజాన్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. టెలిగ్రామ్‌ మరియు ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ల్లో కొన్ని గంటల్లోనే లక్షల షేర్లు నమోదు అయినట్లుగా టాక్‌. ఇలా ఓటీటీ మూవీస్‌ ను కూడా పైరసీ చేస్తే సినిమా పరిశ్రమ బతికేది ఎలా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News