'స‌ర్కారి వారి పాట' కోసం ఫిలిం సిటీలో భారీ సెట్..!

Update: 2020-12-08 06:15 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్నాయి. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. కృష్ణ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ని కరోనా లాక్ డౌన్ కారణంగా సెట్స్ మీదకు తీసుకెళ్లలేక పోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండటంతో మహేష్ అండ్ టీమ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా యూఎస్ లో భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేసుకున్నప్పటికీ.. ఇప్పుడు హైదరాబాద్ లోనే చిత్రీకరణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

'సర్కారు వారి పాట' సినిమా కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ నిర్మాణం చేపడుతున్నారని సమాచారం. జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారట. యూఎస్ లో షూటింగ్ కి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో అనే అనుమానంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తైన తర్వాత యూఎస్ షెడ్యూల్ ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, బ్యాంక్ స్కామ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ లుక్ మరియు క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ తో హింట్ ఇచ్చారు. సూపర్ స్టార్ కెరీర్లో 27వ చిత్రంగా వస్తున్న 'సర్కారు వారి పాట' పై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.
Tags:    

Similar News