ర‌జ‌నీకి విల‌న్ హృతిక్ రోష‌న్‌?!

Update: 2015-12-15 06:45 GMT
రోబో సీక్వెల్ కోసం పెద్ద‌యెత్తున క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. మొన్న వ‌ర‌ద‌ల వ‌ల్ల షూటింగ్ మొద‌ల‌వ్వ‌లేదు కానీ... లేదంటే ఈపాటికే ఆ సినిమాకి సంబంధించిన అన్ని విష‌యాలూ వెలుగులోకి వ‌చ్చేవి. చెన్నై స‌మీపంలో రోబో 2 కోసం పెద్ద సెట్స్ వేస్తున్నారు. ఒక ప‌క్క సెట్స్‌ కి సంబంధించిన ప‌నులు జ‌రుగుతుంటే మ‌రో ప‌క్క కీల‌క‌మైన పాత్ర‌ల కోసం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. ముందుగా విల‌న్ పాత్ర కోసం హాలీవుడ్ న‌టుడు ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గ‌ర్ న‌టిస్తార‌ని ప్ర‌చారం సాగింది. నిజానికి ఆ పాత్ర కోసం ఆర్నాల్డ్‌ నే సంప్ర‌దించార‌ట‌. అందుకు ఆయ‌న కూడా ఒప్పుకొన్నారట‌.

అయితే చిత్రీక‌ర‌ణ‌కోసం పెద్ద‌యెత్తున్న కాల్‌ షీట్లు అవ‌స‌రమ‌వుతుంద‌ని తెలియ‌డంతో ఆర్నాల్డ్ చివ‌రి నిమిషంలో వెన‌క్కి త‌గ్గార‌ట‌. అందుకే మ‌న ఇండియాకి చెందిన న‌టుడినే ఎంపిక చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో శంక‌ర్ ఉన్నాడ‌ట‌. ఆ మేర‌కు బాలీవుడ్‌ కి  చెందిన ప్ర‌ముఖ యువ క‌థానాయ‌కుడు హృతిక్ రోష‌న్‌ ని సంప్రదించార‌ట‌. త‌న పాత్ర న‌చ్చితే చేయ‌డానికి అభ్యంత‌ర‌మేమీ లేద‌ని హృతిక్ చెప్పాడ‌ట‌. రేపోమాపో హృతిక్‌ ని క‌లిసి శంక‌ర్ క‌థ వినిపించ‌బోతున్నాడ‌ని తెలిసింది. అయితే ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న హృతిక్ విల‌న్‌ గా ఎలా క‌నిపిస్తాడ‌ని, ఏ కోణంలో చూసినా హృతిక్ ఇమేజ్ డామినేట్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే శంక‌ర్ మాత్రం హృతిక్ అయితే బాగానే ఉంటాడ‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నాడ‌ట‌. ఈ విష‌యంగురించి త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యానికొచ్చే అవ‌కాశం ఉంది.
Tags:    

Similar News