• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తనవాడైనా శిక్ష పడాల్సిందే...

తనవాడైనా శిక్ష పడాల్సిందే అంటున్న హీరో!!

By - Tupaki Desk
Update: 2018-10-09 05:13 GMT
స్వార్థం అన్నింటి కన్నా ఆధిపత్యం చెలాయించే పరిశ్రమలో తమకు ఇబ్బందులు ఎదురైనా సరే న్యాయం గెలవాలి అని కోరుకునే నటీనటులు తక్కువగా ఉంటారు. అలాంటి అరుదైన కోవలోకి వస్తానంటున్నాడు హృతిక్ రోషన్. గత కొద్దిరోజులుగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న లైంగిక వేధింపుల వివాదాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. తనుశ్రీదత్తా మొదలుపెట్టిన ఈ రచ్చలో ఒక్కొక్కరుగా బాధితులు బయటికి వస్తున్నారు. నానా పాటేకర్ తన మీద తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలకు ఘాటుగా సమాధానం ఇద్దామనుకుని ప్రెస్ మీట్ కు  పిలిచి మరీ క్యాన్సిల్ చేసుకున్నాడు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత సున్నితంగా ఉందొ అర్థమవుతోంది.

కంగనా రౌనత్ సైతం నాలుగేళ్ళ క్రితం క్వీన్ షూటింగ్ సందర్భంగా దర్శకుడు వికాస్ బహ్ల్ తనను ఎంతగా వేధించాడో చెప్పడం ఆలస్యం మరోనటి కూడా తననో పార్టీలో ఏకాంతంగా ఉన్నప్పుడు వికాస్ ముద్దు పెట్టే ప్రయత్నం గురించి చెప్పడం ఇది ఇంకాస్త వేడి రాజుకుంది. దీనికి హృతిక్ రోషన్ కు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది అసలు కిటుకు.

హృతిక్ రోషన్ నటిస్తున్న కొత్త సినిమా సూపర్ 30 దర్శకుడు ఈ వికాసే. జనవరి 25 విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉంది. మొన్నే ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా వదిలారు. తన సినిమా దర్శకుడు కదా ఎందుకు పట్టించుకోవడం అని ఊరుకోలేదు హృతిక్. నేరుగా వికాస్ మీద దాడి మొదలుపెట్టేశాడు. ట్విట్టర్ వేదికగా దీని గురించి స్పందిస్తూ ఇలాంటి వారితో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడటం లేదని నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడి తీరాలని తేల్చి చెప్పేసాడు, అంతే కాదు సూపర్ 30 నిర్మాతలు దీని గురించి విచారణ చేసి నిజానిజాలు తెలుసుకోవాలని కోరాడు. ఒకవేళ నిజమని తేలితే సూపర్ 30 నుంచి వికాస్ ను తప్పించేందుకు కూడా హృతిక్ వెనుకాడడని బాలీవుడ్ టాక్. అంతదాకా వస్తే ఇదో పెద్ద సెన్సేషన్ అవుతుంది. సూపర్ 30 అధిక శాతం షూటింగ్ పూర్తయ్యింది.

ఒకవేళ వికాస్ ను పక్కన పెట్టినా ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి వేరే వాళ్ళతో పూర్తి చేయించడం పెద్ద పనేమీ కాదు. మొత్తానికి హృతిక్ తన దర్శకుడు అని చూడకుండా వికాస్ మీద చర్యకు డిమాండ్ చేయడం చూసి అందరు శభాష్ అంటున్నారు. తెరమీద మాత్రమే హీరోలుగా ఉంటే సరిపోదు ఇలాంటప్పుడే రుజువు చేయాలనీ అతని ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు.
Tags:    
  • Hrithik Roshan 
  • Sexual harassment 
  • Vikas Bahl 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS