పూరి, విజయ్ ఎలా కలిసారంటే ?

Update: 2019-10-31 07:30 GMT
కొన్ని కాంబినేషన్లు అనుకోకుండా సెట్ అవుతాయి. అయితే ప్రేక్షకులు మాత్రం ఆ కాంబినేషన్ ఎప్పటినుండో డిస్కషన్ లో ఉందని అనుకుంటారు. తాజాగా పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ సినిమా కూడా అలాగే ఎప్పటినుండో  డిస్కషన్ లో ఉందని అందరూ ఊహించారు.


కట్ చేస్తే ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయిందో ఓపెన్ అయ్యాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ లో భాగంగా బెంగళూరు టూర్ కి వెళ్ళినప్పుడు తనతో వచ్చిన డాన్సర్ లకు హైదరాబాద్ లో ఓ పార్టీ  ఇచ్చాడట విజయ్. అదే పబ్బులో కింద ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ పార్టీ   జరిగిందట. ఆ సమయంలో తన పార్టీ నుండి కిందకు వెళ్లి పూరి జగన్నాథ్ ని కలిసి కంగ్రాట్స్ చెప్పాడట విజయ్.

ఇక వెంటనే మనం కలుద్దాం విజయ్ అని పూరి అన్నాడట. అలా అన్న 15 రోజుల తర్వాత విజయ్ పూరి ఆఫీసు వెళ్ళాడట. అప్పుడే విజయ్ కి స్టోరీ నరేష్ చేసాడట పూరి. సో అలా తమ కాంబినేషన్ సెట్ అయిందని తెలుగులో చెప్పు కొట్టడం విజయ్. ఇక పూరి  వచ్చే ఏడాది పైసా సినిమాతో మళ్లీ మెస్మరైజ్ చేస్తాడని తెలిపాడు.
Tags:    

Similar News