మరీ ఇంత కమర్షియల్ అయితే ఎలా అనిరుథ్?
తమిళనాట ఏఆర్ రహమాన్ తర్వాత స్థానంలో అనిరుథ్ నిలుస్తాడు అనడంలో సందేహం లేదు. చిన్న వయసులో.. తక్కువ సినిమాలతోనే సంగీత దర్శకుడిగా టాప్ పొజీషన్ కు వెళ్లిన అనిరుథ్ ఇప్పుడు తెలుగు లో కూడా స్టార్ డం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగులో ఈయన మొదటి సినిమా అజ్ఞాతవాసి తీవ్రంగా నిరాశ పర్చింది. సినిమాలోని పాటలు మినిమంగా కూడా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో తెలుగు వారికి అనిరుథ్ ఎక్కక పోవచ్చు అంటూ అంతా భావించారు. ఆ తర్వాత అనిరుథ్ కు ఆఫర్లు దక్కలేదు. రహమాన్ తర్వాత సౌత్ లో రచ్చ చేయగల సత్తా ఉన్న దర్శకుడు అనిరుథ్ అనుకుంటే తెలుగు లో మాత్రం ఆయన పాటలు ఆ రేంజ్ లో వినిపించింది లేదు.
అజ్ఞాతవాసి తర్వాత నాని నటించిన రెండు సినిమా లు 'నాని గ్యాంగ్ లీడర్' మరియు 'జెర్సీ' సినిమాలకు అనిరుథ్ సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రెండు సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అందులోని పాటలు కూడా పర్వాలేదు అన్నట్లుగా ఆకట్టుకున్నాయి. తెలుగులో ఇంకా క్రేజ్ దక్కించుకోవాలంటే మరిన్ని సినిమాలు చేయాలి.. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ ఆల్బం లను ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం అనిరుథ్ ఎక్కువ సినిమాలు చేయాలి. ఇప్పటి వరకు బిగ్ కమర్షియల్ హిట్ ను దక్కించుకోని కారణంగా పెద్ద హీరోలు ఈయనతో వర్క్ కు ఆసక్తి చూపడం లేదు అనే టాక్. చిన్న సినిమాలకు ఈయన అందనంత ఎత్తులో ఉన్నాడట. ఈయన పారితోషికం మూడు నుండి అయిదు కోట్ల వరకు ఉంటుందని తమిళ మీడియా వర్గాల కథనం. అందుకే తెలుగు లో చిన్న సినిమాలకు ఈయన అందని ద్రాక్షల మిగిలి పోయాడు.
అనిరుథ్ ను ఇటీవల కొరటాల శివ ఎన్టీఆర్ 30 కోసం సంప్రదించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమా కోసం అనిరుథ్ ను సంప్రదించగా ఆయన చెప్పిన పారితోషికం మరీ టూ మచ్ అన్నట్లుగా ఉందట. తమిళంలో ఆయన చేసిన మాస్టర్ మూవీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా పారితోషికంను భారీగా పెంచేశాడు. అక్కడ మాత్రమే కాకుండా ఇక్కడ కూడా అదే పారితోషికంను డిమాండ్ చేస్తున్నాడట. తెలుగు లో పెద్దగా మార్కెట్ లేని అనిరుథ్ కు అంతగా పారితోషికం ఇవ్వడం ఎంత వరకు వర్కౌట్ అవుతుందనే విషయంలో మేకర్స్ మల్లగుల్లాలు పడుతున్నారట. అనిరుథ్ మరీ అంతగా కమర్షియల్ అయితే తెలుగులో స్టార్ డం దక్కించుకోవడం కష్టం అని.. చిన్న పెద్ద సినిమాలు చేసి కమర్షియల్ గా భారీ విజయాలు దక్కించుకుంటే అప్పుడు పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయవచ్చు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం ను అందుకుంటున్న సంగీత దర్శకుడిగా అనిరుథ్ నిలిచాడు. మరి అంత మొత్తంను ఆయనకు ఇచ్చి ఎన్టీఆర్ 30 మేకర్స్ వర్క్ చేయించుకుంటారా అనేది చూడాలి.