రానా సినిమా కోసం హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ముందుకొస్తోందా...?
దగ్గుబాటి వారసుడిగా 'లీడర్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుండి కేవలం కథా బలమున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో భళ్లాలదేవుడుగా నటించిన రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పటి నుంచి రానా ఎప్పుటికప్పుడు విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగు తమిళ హిందీ భాషల్లో 'అరణ్య' అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు రానా. ప్రభు సాలోమన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'అరణ్య'.. తమిళంలో 'కాదన్'.. హిందీలో 'హాథీ మేరే సాథీ'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు వేణు ఉడుగుల దర్శకత్వంలో సోషల్ డ్రామా 'విరాట పర్వం' లో నటించాడు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా నిలిచిపోయింది.
ఇదిలా ఉండగా రానా క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో 'హిర్యణ్యకశ్యప' అనే సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాని సురేశ్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు మరియు గుణ టీమ్ వర్క్స్ గుణశేఖర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టే గత మూడేళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా 'హిర్యణ్యకశ్యప' ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు గుణశేఖర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కోసం సుమారు 15 కోట్ల వరకు ఖర్చు చేశారట. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే దీనికి సంబందించి సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మధ్య చర్చలు జరుగుతున్నాయట.
కాగా ఇది భక్త ప్రహ్లాద కథ అయినప్పటికీ ఈ సినిమాను హిరణ్యకశ్యపుడి కోణంలో గుణశేఖర్ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. రానా టైటిల్ రోల్ 'హిరణ్యకశ్యప' పాత్రలో కనిపించబోతున్నాడు. 'బాహుబలి' వంటి జానపద చిత్రం.. 'రుద్రమదేవి' వంటి చారిత్రక నేపథ్య సినిమాల్లో నటించిన దగ్గుబాటి రానా ఇప్పుడు 'హిరణ్యకశ్యప' వంటి పౌరాణిక చిత్రంలో కూడా నటించబోతున్నాడు. పరిస్థితులు చక్కబడి రానా ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన వెంటనే 'హిరణ్యకశ్యప' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.