భగవద్గీత చదివేస్తున్న హాలీవుడ్ హీరో

Update: 2017-12-20 02:30 GMT
భగవద్గీత.. హిందువుల పవిత్ర గ్రంథం. కానీ అందులోని విషయంలో కేవలం హిందువుల్లోనే కాదు.. ఇతర మతస్థుల్లోనూ ఆలోచన రేకెత్తించేవే. వేరే మతస్థులెందరో ఈ గ్రంథం చదివి స్ఫూర్తి పొందిన వాళ్లే. ముస్లిం అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సైతం భగవద్గీత గురించి గొప్పగా చెబుతాడు. అతను కూడా ఆ గ్రంథాన్ని ఎప్పుడో చదివాడు. ఇప్పుడు ఓ హాలీవుడ్ హీరో సైతం భగవద్గీత గురించి మాట్లాడటం విశేషం. ఆ హీరో మరెవరో కాదు.. ‘పర్ష్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’.. ‘ఐయామ్ లెజెండ్’ లాంటి అద్భుత చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించిన విల్ స్మిత్. తాను భగవద్గీత గ్రంథాన్ని కొంత కాలం నుంచి చదువుతున్నానని.. ఇప్పటికే 90 శాతం పూర్తయిందని విల్ స్మిత్ చెప్పడం విశేషం.

విల్ స్మిత్ ప్రస్తుతం ముంబయిలో సందడి చేస్తున్నారు. తాను హీరోగా నటించిన బ్రైట్ సినిమా డిసెంబర్ 22న భారత్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఇక్కడ పెద‍్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాల్లో పాల‍్గొంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విల్ స్మిత్ తాను భగవద్గీత చదువుతున్న విషయాన్ని వెల్లడించాడు. భారతీయ చరిత్ర అంటే తనకు చాలా ఇష్టమని.. తాను త్వరలో రిషికేశ్ కు వెళ్లనున్నానని అతను తెలిపాడు. తనకు ఇండియా అంటే ఇష్టమని.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో తనకున్న మంచి స్నేహం ఉందని.. అక్షయ్ ఇంట్లో భోజనం అంటే తనకెంతో ఇష్టమని వెల్లడించాడు. అతడితో సమయం గడపడం తనకు నచ్చుతుందని అన్నాడు. స్మిత్ తో పాటు మరో హాలీవుడ్ నటుడు జోయెల్ ఎడ్‌ గార్టెన్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.


Tags:    

Similar News