ప్రముఖ హీరో మృతి.. పలువురి సంతాపం

Update: 2020-04-17 11:30 GMT
అలనాటి ప్రముఖ హాలీవుడ్ నటుడు - గోల్డెన్ గ్లోబ్ విజేత అయిన హీరో బ్రేన్ డెన్నీ (81) బుధవారం తన స్వగృహంలో కన్నుమూశారు. బ్రేన్ డెన్నీ 1938లో అమెరికాలోని కనెక్టికట్ లోని బ్రిడ్గ్ ఫోర్ట్ లో జన్మించాడు. 12 ఏళ్లకే యూఎస్ మెరైన్స్ లో పనిచేశాడు. అనంతరం న్యూయార్క్ కు చేరి స్టాక్ బ్రోకర్ గా పనిచేశారు. ఆ తర్వాత సినిమాల వైపు ప్రయాణం చేశాడు. జెన్నిఫర్ అనే యువతిని చేసుకొని కొడుకు - కూతురును కన్నాడు.

బ్రేన్ డెన్నీ తీసిన ఫస్ట్ బ్లడ్ - రోమియో జూలియట్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇతడిని అప్పట్లో స్టార్ హీరోను చేశాయి. 40ఏళ్లలో టీవీ షోలలో కూడా కనిపించి వినోదాన్ని అందించాడు.

1985లో వచ్చిన స్కిఫికాకూన్ సినిమాలో ఏలియన్స్ లీడర్ గా కనిపించి అలరించాడు. 1996లో రోమియో జూలియన్ సినిమాలో రోమియో తండ్రిగా నటించాడు. ప్రఖ్యాతి గాంచిన గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నాడు.

కాగా అమెరికాలో కరోనా విస్తృతి దృష్ట్యా బ్రేన్ డెన్నీ మరణంపై ఆయన కూతురు ఎలిజబెత్ వివరణ ఇచ్చింది. తమ తండ్రి కరోనా వల్ల చనిపోలేదని.. సహజ మరణం అని తెలిపింది.


Tags:    

Similar News