ఈ చెత్త స్పూఫులు వాళ్లకు అర్ధంకావట్లే

Update: 2016-08-27 22:30 GMT
కాన్సెప్టు కామెడీ చేయాలా? స్పూఫ్‌ కామెడీ చేయాలా? మనం ఉదాహరణకు ''బజరంగీ భాయిజాన్'' సినిమా చూశాం అనుకోండి.. ఆ సినిమాలోని సిట్యుయేషనల్ కామెడీ మనల్ని అలరిస్తుంది. కొత్తగా ఉంటుంది. అలాగే మన ''ఊహలు గుసగుసలాడే'' సినిమా చూసినా.. ఆ సినిమాలోని రొమాంటిక్ కామెడీ అదిరిపోతుంది. అమెరికా వీసాల నుండి ఈతరం ప్రేమికుల వరకు.. అందరిమీదనా పడే సెటైర్లు బాగుంటాయి. ఇక ''సూదు కవ్వుం'' వంటి తమిళ సినిమా చూసినా.. (తెలుగులో గెడ్డం గ్యాంగ్ అని తీశారులే).. అందులోని రగ్గడ్ కామెడీ కూడా బాగుంటుంది. ఈ సినిమాలను ఏ బాషలోకి డబ్ చేసినా కూడా.. అక్కడివారు ఆ కామెడీని చూసి ఎంజాయ్ చేస్తారు. అక్కడ వరకు బాగానే ఉంది.

ఫర్ ఎగ్జాంపుల్.. మన సినిమాల గురించి తెలియని వారు.. మన కొత్త సినిమాలను కొన్నింటిని డబ్బింగులో చూశారనుకోండి.. 30 ఇయర్స్ పృథ్వీ చేసే స్పూఫ్‌ కామెడీ వారికి అర్ధమవుతుందా? మనోడు ఇతర హీరోలను ఇమిటేట్ చేస్తూ వేరే సినిమాల కాన్సెప్టులపై పంచులు వేస్తుంటే.. అవి తెలుగు వారికి తప్పించి.. వేరే బాషల వారికి అర్ధంకావు. ఇదే విషయాన్ని ఇప్పుడు బాలీవుడ్ టివి ఛానళ్ళు మన నిర్మాతలతో మొరపెట్టుకుంటున్నాయట. దయచేసి మీ సినిమాల్లో ఈ స్పూఫ్‌ కామెడీలను తగ్గించండి.. అవి నార్త్ లోని మాస్ ఆడియన్స్ కు అస్సలు అర్దంకావట్లేదు అని చెబుతున్నాయట. మరి మనోళ్ళు హిందీలో తమిళంలో మలయాళంలో మార్కెట్ పెరగాలంటే.. ఈ చెత్త స్పూఫులు మానేసి.. ఏదన్నా ఒరిజినల్ కామెడీ ట్రాకులు పెట్టాలి. పెడతారా బాసూ?
Tags:    

Similar News