• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా ని పక్కన పెట్టిన...

సైరా ని పక్కన పెట్టిన హిందీ జనాలు...!

By - Tupaki Desk
Update: 2019-10-05 11:42 GMT
బుధవారం విడుదలైన భారీ చిత్రం సైరా అన్ని ఏరియాలలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఉత్తరాదిన మాత్రం ఈ సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అయోమయంలో పడిపోయారు. అక్కడ ఈ సినిమాకి సాహో సినిమాకంటే మంచి రివ్యూలు కూడా వచ్చాయి. అయినా అక్కడ వార్ సినిమాతో పోటీగా రిలీజ్ చేయడంతో సైరా కి నామమాత్రపు కలెక్షన్స్ కూడా రావట్లేదు. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా తీసినా హిందీ ఆడియన్స్ ఎందుకు పక్కన పెట్టారో తెలియట్లేదని అనుకుంటున్నారు.

ఈ సినిమా హిందీ వెర్షన్ లో మొదటిరోజు కేవలం 2.5 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. రెండవ రోజు అయితే ఈ కలెక్షన్స్ కోటి రూపాయల లోపే ఉన్నాయి. అయితే ఈ రోజు, రేపు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల కలెక్షన్స్ మీద సినిమా యూనిట్ చాలా ఆశలు పెట్టుకుంది. అమితాబ్, తమన్నా లాంటి బాలీవుడ్ జనానికి పరిచయం ఉన్న ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నా అక్కడి జనం మాత్రం ఈ సినిమాని పట్టించుకోవట్లేదు. ఏదేమైనా హిందీ వెర్షన్ లో సైరా భారీ డిజాస్టర్ గా నిలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
Tags:    
  • surendar reddy 
  • movie 
  • syera 
  • syera narasimhareddy 
  • nithin 
  • tollywood 
  • latest movie 

Similar News

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS