ఒకే కారులో కేసీఅర్, బాబు, జగన్ ప్రయాణం!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారంటే... నమ్మొచ్చు. ఈ మధ్య ఇద్దరు చంద్రులూ అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉంటున్నారు కాబట్టి, అదే క్రమంలో మరోసారి ఎక్కడో కలిశారని అనుకోవచ్చు! కానీ, ఈ ఇద్దరితోపాటు జగన్ కూడా కలిశారంటే నమ్మగలమా..? అంతేనా... చంద్రబాబు కేసీఆర్ జగన్‌లు ఒకే కారులో పక్కపక్కన కూర్చుని ప్రయాణించారంటే ఎలా ఉంటుందీ... కలలో కూడా సాధ్యం కాదు అనిపిస్తుంది! వాస్తవంలో ఆ ఊహే అసాధ్యం కాబట్టి, వెండితెరపై ఈ ముగ్గురునీ కలిశాడు సునీల్! సునీల్ హీరో నటించిన ‘ఈడు గెల్డ్ ఎహే’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్రం ట్రైలర్ లో ఈ ముగ్గురి నాయకుల కారు జర్నీ ప్రస్థావన చాలామందిని ఆసక్తికరంగా ఎట్రాక్ట్ చేస్తోంది.
ఈ సినిమా ట్రైలర్ అంతా కథకు సంబంధించే ఉంటుంది. కానీ, చివరికి వచ్చేసరికి జగన్ - కేసీఆర్ - చంద్రబాబుల ప్రస్థావనను పోసాని కృష్ణమురళీ దగ్గర తీసుకొస్తారు. పోసానితో సునీల్ మాట్లాడుతూ... ‘ఒక కారులో జగన్ - చంద్రబాబు నాయుడు - కేసీఆర్ లు కలిసి వెళ్తున్నారు’ అని ఒక కథ చెబుతాడు. ఇలా ఇంకేదో చెప్పబోతూ ఉండగా పోసాని మధ్యలో అపేసి... ‘ఇంకా నయం - డ్రైవింగ్ లో లోకేష్ బాబు - పక్కసీట్లో మహేష్ బాబు అని చెప్పలేదు’ అనేసి ఓ పంచ్ వేస్తాడు.
ఇంతకీ ఈ నాయకుల ప్రస్థావన సరదాగా ఒక సీన్ కోసం వాడుకున్నారో - సినిమాలో ఇంకాస్త ఎక్స్ టెన్షన్ ఇచ్చారో తెలీదుగానీ - ప్రస్తుతానికి పబ్లిసిటీకి బాగానే పనికొస్తోంది. ఈ ముగ్గురు నాయకులూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎంత ప్రముఖులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకోటీ... ఈ ముగ్గురి కలయిక అనే ఊహ కూడా హాట్ టాపిక్ కదా! పొలిటికల్ ఇంట్రెస్ట్ ఒక పాయింట్ ను ట్రైలర్ వరకూ బాగానే వాడుకున్నారు - ఇంతకీ సినిమాలో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/