హీరో విశాల్ కు కోర్టులో ఎదురు దెబ్బ..?
ఓ ఫైనాన్షియర్ కు డబ్బులు బకాయి పడ్డ కేసులో తమిళ్ హీరో విశాల్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని సమాచారం. సదరు ఫైనాన్షియర్ కు భారీ మొత్తంలో నగదు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనం ప్రచురించింది.
ఓ ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకున్న విశాల్.. తిరిగి చెల్లించకపోవడంతో అతడు కోర్టు మెట్లు ఎక్కాడట. ఫైనాన్షియర్ విజయ్ కొఠారి నుండి విశాల్ రూ. 50 లక్షలు తీసుకున్నాడని సమాచారం. సందకోజి-2 (పందెం కోడి-2) చిత్రం షూట్ కోసం తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ కొఠారి కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన న్యాయస్థానం కొఠారికి రూ.50 లక్షలు చెల్లించాలని విశాల్ ను ఆదేశించిందని ‘టైమ్స్’ మీడియా వెల్లడించింది.
కాగా.. ప్రస్తుతం ‘నోటా’ ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్ ‘ఎనిమీ’ చిత్రంలో నటిస్తున్నాడు. మరో నటుడు ‘ఆర్య’ నెెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. మిర్నాలిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు.