300 చీరలు ఇచ్చేసి భారం దించేసుకున్నా
బుల్లి తెరపై.. వెండి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న జాన్సీ సామాజిక కార్యక్రమాల నిర్వాహణలో ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. ఆమె ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు మీడియా సంస్థలతో కలిసి పని చేశారు. ఎన్నో ఎంటర్ టైన్ మెంట్ షోల్లో హోస్ట్ గా వ్యవహరించారు. అలాంటి జాన్సీ కరోనా సమయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను అంది. కరోనా వల్ల నాకు నేను చాలా విషయాలను నేర్చుకోవడంతో పాటు ఏది అమితంగా మనవద్ద దాచుకోనవసరం లేదు అనే విషయాన్ని తెలుసుకున్నానంది.
తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడిన జాన్సీ కరోనాతో తన పిన్ని చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి నుండి బయటకు వెళ్లని ఆ వ్యక్తి కరోనా కారణంగా చనిపోవడంను జీర్ణించుకోలేక పోయాను అంది. ఎంతో మంది కరోనాతో మృత్యువాత పడుతుండటం.. చాలా మంది ఇబ్బందులు పడుతుండటం చూడలేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్బాలున్నాయి అన్నారు. అవసరానికి మించి ఉండొద్దనే ఉద్దేశ్యంతో నా వద్ద ఉన్న చీరలను ఇతరులకు ఇచ్చేశానంటూ జాన్సీ చెప్పుకొచ్చారు.
తన వద్ద ఉన్న దాదాపు 300 చీరలను తెలిసిన వారికి.. అవసరం అయిన వారికి ఇచ్చేశాను. నేను ప్రత్యకంగా భావించేవి.. నా సొంతంగా నేయించుకున్న చీరలను మాత్రమే నేను ఉంచుకున్నాను. మిగిలిన అన్ని చీరలు ఇచ్చేయడంతో నా పై ఉన్న చాలా పెద్ద భారంను దింపేసుకున్నట్లుగా అనిపించింది. చీరలు పంచి పెట్టడంతో నా మనసు తేలిక పడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. మినిమలిస్టిక్ ఫిలాసఫీ ప్రకారం భారంను ఎంత తగ్గించుకుంటే అంత ప్రశాంతంగా ఉంటామని జాన్సీ అన్నారు.