5 లక్షల రెమ్యూనరేషన్ లేని హీరోయిన్ కు 100 కోట్ల ప్రాపర్టీనా...?

Update: 2020-09-14 08:30 GMT
కన్నడ చిత్ర సీమలోని డ్రగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగుళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరోయిన్స్ రాగిణి ద్వివేది - సంజనా లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరితోపాటు డ్రగ్స్ కేసులో సంబంధమున్న మరో 12 మందిని అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సంజన కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉండడం సీసీబీ పోలీసులకు విస్మ‌యం క‌లిగించిన‌ట్లు స్థానిక మీడియా చెప్పుకొచ్చింది. సంజన తనకు నగరంలో పది ఫ్లాట్లు ఉన్నట్లు సంజన చెప్పడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. ఆమె నటించింది తక్కువ సినిమాలే తీసుకునేది కూడా తక్కువ పారితోషకమే.. మరి కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు?.. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో తరలించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మరింత లోతుగా విచారణ చేసి వారి ఆస్తుల లెక్కలను తేల్చడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సరికొత్తగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ఈడీ అధికారులు ఇప్పటికే సంజన పై ప్రత్యేకంగా కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారని.. అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు సంపాదించారా.. బినామీ పేర్లతో వీరి దగ్గర ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే విషయాలపై ఈడీ దర్యాప్తు చేస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది.

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో కూడా సంజన ఆస్తుల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. తెలుగులో సంజన పలు చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటించడంతో పాటు క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. సినిమాకి సుమారు 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తుంటారని టాక్. అయితే అంత తక్కువ పారితోషకం తీసుకునే సంజన.. విలాసవంతమైన జీవితం గడపడానికి డ్రగ్స్ వ్యవహారమే కారణం అయ్యుండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. డ్రగ్ ఏజెంట్ గా చేసింది కాబట్టే బెంగుళూరులో వందల కోట్ల ఆస్తి సంపాదించి ఉంటుందని.. టాలీవుడ్ కి కూడా డ్రగ్స్ సరఫరా చేసి భ్రష్టు పట్టించిందని విమర్శిస్తున్నారు. ఆమెకు డ్రగ్స్ తో సంబంధం లేకపోతే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడకుండా రచ్చ చేస్తూ పోలీసులకు ఎందుకు సహకరించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ ని టాలీవుడ్ కు తెచ్చుకొని చెడ్డ పేరు తెచ్చుకునేకంటే.. తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు ఇచ్చి వారిని ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీ బాగుపడుతుందని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు హీరోయిన్స్ ని వదిలేసి నార్త్ ఇండియన్ బ్యూటీస్ ని బెంగుళూరు ఫాస్ట్ కల్చర్ అమ్మాయిలని తెచ్చుకుంటే ఇలాంటి కేసుల్లో టాలీవుడ్ వాళ్ళను కూడా ఇరికించే పరిస్థితి వస్తుందని సినీ విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా టాలీవుడ్ కి చెడ్డ పేరు తీసుకొచ్చే వారి బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
Tags:    

Similar News