పెళ్లికొడుకుగా హీరో సుమంత్ అశ్విన్.. హల్దీ వేడుకలు వైరల్!

Update: 2021-02-12 18:29 GMT
ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ పెళ్లి బంధంలో అడుగు పెట్టబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన దీపిక అనే అమ్మాయిని సుమంత్ మనువాడుతున్నాడు. వీరి వివాహం ఈ నెల ఫిబ్రవరి 13న అంటే శనివారం హైదరాబాద్‌లోని వారి ఫామౌజ్ లో జరగనుంది. వాలంటైన్స్ డే సమయంలో సుమంత్ పెళ్లి చేసుకోబోతుండటం విశేషం. ప్రస్తుతం సుమంత్ వయసు 32ఏళ్ళు. ఇంకా ఆలస్యం ఎందుకని పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు. అయితే ఈ సుమంత్ పెళ్లి వేడుక పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో జరగనుంది. అయితే పెళ్లి వేడుకలు దగ్గర పడుతున్నా కొద్దీ పెళ్లికొడుకు పెళ్లికూతురు ముఖాలలో సిగ్గు వెలిగిపోతుంది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలు చూస్తే అర్ధమవుతుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సుమంత్ హల్దీ సెలెబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలలో ఇద్దరూ సుమంత్, దీపిక సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతున్నారు. ఇదిలా ఉండగా.. 2012లో సుమంత్ అశ్విన్ ను ఆయన తండ్రి ఎంఎస్ రాజునే ‘తూనీగ తూనీగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేసాడు. అయితే 2015లో చేసిన ‘కేరింత’ సినిమాతో సుమంత్ అశ్విన్‌ మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరవాత కొలంబస్, రైట్ రైట్, ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథా చిత్రమ్ 2 సినిమాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ప్రస్తుతం సుమంత్ ‘ఇదే మా కథ’ అనే సినిమాతో రెడీ అయ్యాడు. ఆ సినిమా ఇదే నెలలో 19న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. చూడాలి మరి ఈ కొత్త పెళ్లికొడుకు కొత్త హిట్ అందుకుంటాడేమో!


Tags:    

Similar News