బాటిల్ ఇస్తాను.. కార్ లోకి ర‌మ్మ‌ని పిలిచాడ‌ట‌!

Update: 2020-03-21 03:30 GMT
సెల‌బ్రిటీ లైఫ్ ఒత్తిళ్లు.. హ్యాబిట్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాలా? నిరంత‌రం ఆన్ లొకేష‌న్ బోలెడంత హైరానా ప‌డాలి. అటుపై కెరీర్ ఒడిదుడుకుల నుంచి నిల‌దొక్కుకుని ఒక స్టాటస్ ని అందుకోవాలి. అది ద‌క్క‌డం మాటేమో గానీ.. అందే వ‌ర‌కూ ప‌డే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ క్ర‌మంలోనే వ‌ర్థ‌మాన న‌టీన‌టులు ఒత్తిళ్ల‌కు లోనై బాటిల్ (ఆల్క‌హాల్) కి అల‌వాటు ప‌డిపోతున్నార‌న్న‌ది ఓ అధికారిక స‌ర్వే.

ఆల్క‌హాల్ అడిక్ష‌న్ కి పెద్ద తెర‌.. బుల్లితెర అనే తేడా ఏం లేదు. అన్నిచోట్లా న‌టీమ‌ణులు బాటిల్ పుచ్చుకోనిదే నిదురించే ప‌రిస్థితి ఉండ‌డం లేద‌ట‌. కొందరు సీరియ‌ల్ న‌టీమ‌ణులు రెగ్యుల‌ర్ గా ఖ‌రీదైన వైన్ తాగ‌నిదే నిదుర‌పోర‌న్న టాక్ ఉంది. ఎందుకంటే విజువ‌ల్ మీడియంలో గ్లామ‌ర్ కి ఉన్న ప్ర‌ధాన్య‌త దృష్ట్యా ఒత్తిళ్ల‌ను ముఖంలో క‌నిపించ‌నివ్వ‌కూడ‌దు. అలా మెయింటెయిన్ చేయాలంటే అందుకు బాటిల్ పుచ్చుకోవాల్సిన ప‌రిస్థితి ఉంటుందిట‌. ఈ విష‌యంలో ఆడా మ‌గా అనే తేడా ఏం లేదు.

ఇక స‌క్సెస్ పార్టీలు.. ప్రీరిలీజ్ పార్టీలు.. టీవీ స్క్రీనింగ్ అవార్డుల పార్టీలు.. అంటూ టీమ్ లుగా క‌లుసుకుని చేసే హంగామా లో న‌టీమ‌ణులు వైన్ పుచ్చుకోవ‌డానికి మ‌రీ అంత‌గా భేష‌జానికి పోవ‌డం లేదని తెలుస్తోంది. అదే కోవ‌లో ఇటీవ‌ల జ‌రిగిన ఓ పార్టీలో ఓ అందాల భామ‌కు స‌ద‌రు హీరోగారు బాటిల్ ఆఫ‌ర్ చేశార‌ట‌. ఖ‌రీదైన వైన్ బాటిల్ కావాలంటే త‌న కార్ లో రెడీగా ఉంద‌ని కాస్త వెయిట్ చేయ‌మ‌ని కోరార‌ట ఆ హీరోగారు. మొత్తానికి స‌ద‌రు హీరోయిన్ వెయిట్ చేసి కార్ వ‌ర‌కూ వెళ్లి అత‌డు ఇచ్చిన‌ బాటిల్ అందుకునే అక్క‌డినుంచి వెళ్లింది అంటూ గుస‌గుస‌లు వినిపించాయి. ఇంత‌కీ బాటిల్ ఇచ్చిన గురుడు ఎవ‌రు? అందుకున్న స‌ద‌రు హీరోయిన్ ఎవ‌రు? అంటే.. ప్ర‌స్తుతానికి టాప్ సీక్రెట్. ఇట్టే చెప్ప‌య‌డం కుద‌ర‌దు!


Tags:    

Similar News