'రాజావిక్రమార్క' రిలీజ్ డేట్ ఇదిగో
ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరును దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ సక్సెస్ ను కూడా దక్కించుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న కార్తికేయ ఈ దీపావళికి తన రాజావిక్రమార్క సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. శ్రీ సారిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో కార్తికేయ లుక్ మరియు పాత్ర తీరు చాలా డిఫరెంట్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఒక కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో కాకుండా మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో కార్తికేయ బ్యాక్ టు బ్యాక్ మంచి స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటున్నాడు. అలాంటి సినిమానే రాజా విక్రమార్క. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఎప్పుడో రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో నవంబర్ 12న ఇతర సినిమాలు పోటీకి ఉన్నా కూడా విడుదలకు సిద్దం అయ్యారు. పెద్ద ఎత్తున అంచనాలున్న రాజావిక్రమార్క సినిమాను పెద్ద ఎత్తున దీపావళికి విడుదల చేయబోతున్నారు.
నవంబర్ 12వ తారీకున నాగశౌర్య నటించిన 'లక్ష్య' మరియు ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం' విమానం సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో కార్తికేయ రాజావిక్రమార్క సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు. ఈమద్య కాలంలో కార్తికేయ స్టార్ డమ్ బాగా పెరిగింది. ఆయన అజిత్ తో వాలిమై సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల ఆయనకు తమిళంలో కూడా మంచి పేరు రావడం ఖాయం అంటున్నారు. వాలిమై తర్వాత కార్తికేయ తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.