రాజమాత కూడా స్వరార్పణ అంటోందే

Update: 2016-09-27 04:26 GMT
ఇప్పుడు చాలామంది పరబాషా నటులు.. తెలుగులో నటించడానికే కాదు.. ఏకంగా డబ్బింగ్ కూడా స్వయంగా తామే చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. నాజర్ నుండి సాయాజీ షిండే వరకు.. ప్రియమణి నుండి తాపీ్స వరకు అందరూ తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి తెగ ఉబలాటిపడిపోయి చెప్పేసినవారే. ఇప్పుడు ఇదే రూటులో ఓ రాజమాత కూడా నడుస్తానంటోంది.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బాలీవుడ్ డ్రీమ్ గాళ్‌ హేమా మాలిని హీరోకు తల్లిగా రాజమాత క్యారెక్టర్ చేస్తోంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర తరహాలో ఇక్కడ కూడా హేమ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అయితే ఈ పాత్రలో నటించిన తరువాత.. హేమకు తెలుగులో తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటే బాగుంటుందని అనిపించి.. నేను ప్రయత్నిస్తాను ప్లీజ్ అంటూ దర్శకుడు క్రిష్‌ ను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైతే తెలుగులో చాలా రేర్ గా డబ్బింగ్ చెప్పిన రమ్య కృష్ణ తన శివగామి పాత్రకు తానే గాత్రధానం చేసుకుందో.. ఇప్పుడు హేమ కూడా అదే విధంగా స్వరార్పణ చేస్తానంటోంది.

ఇకపోతే దర్శకుడు క్రిష్‌ మాత్రం.. ఒక్కసారి ఫైనల్ వాయిస్ వర్షెన్ విన్న తరువాత.. బాగుంటే ఓకె లేకపోతే మాత్రం ట్రెడిషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజా రమణి చేతనే డబ్బింగ్ చెప్పించాలని యోచిస్తున్నాడట. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News