రెండు సినిమాల‌తోనే పెద్ద డైరెక్ట‌ర్ అయిపోయాడుగా..!

Update: 2020-12-22 02:30 GMT
'ఛలో' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెంకీ కుడుముల. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల.. రెండో సినిమాగా నితిన్ తో 'భీష్మ' తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రెండు వరుస విజయాలు అందుకున్న వెంకీ కుడుముల నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వెంకీ మూడో సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు డేట్స్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని సినీ వర్గాల్లో టాక్ న‌డ‌స్తోంది. మొత్తంగా రామ్ చ‌ర‌ణ్ - వెంకీ కాంబినేష‌న్ సెట్ అవ్వ‌చ్చని అంటున్నారు. గతంలో వెంకీ కుడుముల రామ్ చరణ్ నటించిన 'తుఫాన్' సినిమాకి రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసాడు. ఆ పరిచయంతో చరణ్ కి వెంకీ స్టోరీ వినిపించాడని.. స్క్రిప్ట్ నచ్చడంతో చరణ్ ఓకే చేసాడని టాక్. అలానే మహేష్ బాబు కోసం వెంకీ కుడుముల ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడట. మహేష్ కూడా దీనికి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

ముందుగా చరణ్ తో ఆ తర్వాత మహేష్ తో వెంకీ సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. ఇదే గ‌నుక జ‌రిగితే వెంకీ కుడుమల టాప్ లీగ్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లోకి చేరిపోయినట్లేనని చెప్పవచ్చు. మీడియం రేంజ్ హీరోల‌తో సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొడుతున్న ద‌ర్శ‌కులు చాలా మందే ఇండ‌స్ట్రీలో ఉన్నప్పటికీ.. వెంకీ మాత్రం కేవలం రెండు సినిమాలు చేసిన అనుభవంతో పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేస్తున్నాడు. అయితే నాగచైతన్య - నాని - శ‌ర్వానంద్ - నితిన్ - నాగ‌శౌర్య‌ - విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న మారుతి - శివ‌ నిర్వాణ వంటి దర్శకులకే పెద్ద హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం ఇంకా రాలేదు. అయితే ఇద్ద‌రు యంగ్ హీరోల‌కి పెద్ద బ్రేక్ ఇచ్చే సినిమాలు తీసిన వెంకీ.. వీరంద‌రిని వెనక్కి నెట్టేసి టాప్ లీగ్ డైరెక్టర్స్ జాబితాలోకి వెళ్లిపోనున్నాడని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.
Tags:    

Similar News