క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ ఇప్పట్లో కష్టమే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ పేట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు మహేష్. విజయేంద్రప్రసాద్ ఇప్పటికే స్టోరీ లైన్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే 'ఆర్.ఆర్ ఆర్' సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న జక్కన్న.. మహేష్ తో ప్రాజెక్ట్ షురూ చేయడానికి చాలా సమయమే పట్టనుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ మరో మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిజానికి రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్ రెండు ప్రాజెక్ట్స్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఒకటే సెట్టయ్యేలా ఉంది. దీనికి తగ్గట్టే అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూతో మహేశ్ తో మరో సినిమా చేస్తాడని అర్థం అవుతుంది. దీంతో అప్పుడెప్పుడో మహేష్ ప్రకటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఇప్పట్లో కష్టమే అని టాక్ నడుస్తోంది. 'అతడు' 'ఖలేజా' తర్వాత వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు అనీల్ రావిపూడి రేస్ లోకి రావడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. మరి త్రివిక్రమ్ డైరెక్షన్ లో '#SSMB30' మూవీ సెట్ అవుతుందేమో చూడాలి.