#క‌రోనా: హ‌రీషా ఎంత ప‌ని చేశావ్! ఇంద‌రిలో నువ్వు వేర‌యా!

Update: 2020-04-15 03:45 GMT
అంద‌రిలాగా ఆలోచిస్తే హ‌రీష్ ఎందుకు అవుతాడు?  గ‌బ్బ‌ర్ సింగ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ త‌న‌కే ఎందుకు ద‌క్కుతుంది. ఇత‌రుల‌తో పోలిస్తే మాసీగా స్పైసీగా క‌ల‌ర్ ఫుల్ గా ఆలోచిస్తాడు కాబ‌ట్టే అత‌డిలోని క్వాలిటీస్ ని మెచ్చి ప‌వ‌న్ క‌ల్యాణ్ - ఎన్టీఆర్ - బ‌న్ని లాంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్లు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేశారు. గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ గా హ‌రీష్ శంక‌ర్ పాపులారిటీ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు.

కొవిడ్ 19 విజృంభిస్తున్న ఇలాంటి త‌రుణంలో టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా సేవికులుగా మారి పేద కార్మికుల‌కు ఆర్థిక విరాళాల‌తో పాటు నిత్యావ‌స‌రాల్ని అందిస్తున్నారు. మ‌రి హ‌రీష్ శంక‌ర్ ఏం చేశాడు? అంటే .. ఇటీవ‌లి కాలంలో హ‌రీష్ సోష‌ల్ మీడియాలో చాలా హ‌డావుడి చేస్తున్నాడు. మునుప‌టితో పోలిస్తే ఎంతో నాలెజ్ తో కూడుకున్న మెసేజ్ లు పోస్ట్ చేస్తూ అభిమానుల్లో అవేర్ నెస్ పెంచుతున్నాడు. కొవిడ్ 19 విజృంభ‌ణ పైనా ప‌లు ఆస‌క్తిక‌ర సందేశాల్ని పోస్ట్ చేసిన హ‌రీష్‌.. కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తి  తెలిసింది.

కొవిడ్ 19 ఔట్ బ్రేక్ ప్ర‌భావం కేవ‌లం సినీకార్మికుల‌పైనే కాదు డ్రామా క‌ళాకారుల‌పైనా ప‌డింది. అందునా ఫేమ‌స్ సుర‌భి డ్రామా కంపెనీ ఆల్మోస్ట్ మూత‌ప‌డి పోయింది. ఇందులో ప‌ని చేస్తున్న క‌ళాకారులకు పోష‌ణ లేక క‌డుపులు ఎండే ప‌రిస్థితి నెల‌కొంది. వీళ్ల గురించి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా ప్ర‌భుత్వాలు స‌రిగా ప‌ట్టించుకున్న‌దే లేదు. అందుకే హ‌రీష్ శంక‌ర్ వెంట‌నే స్పందించి సురభి డ్రామా కంపెనీ క‌ళాకారుల కోసం నిత్యావ‌స‌రాలను పంపిణీ చేశాడు. ఏకంగా 81 బ్యాగ్స్ స‌రుకుల్ని పంపిణీ చేశాడు. అందుకోసం టీవీ జ‌ర్న‌లిస్టుల సాయం తీసుకున్నాడు. సుర‌భి క‌ళాకారుల క‌ష్టానికి సంబంధించిన వీడియో త‌న‌ని క‌ల‌చి వేసిందని మ‌న ఆర్టిస్టుల్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌కు ఉంద‌ని హ‌రీష్ ఈ సంద‌ర్భంగా అన్నారు. క‌ళాకారుల్ని ఆదుకోవాల్సిన బాధ్య‌త‌ను గుర్తు చేశారు హ‌రీష్‌. సుర‌భి నాట‌కాల‌కు మునుప‌టి తో పోలిస్తే ఆద‌ర‌ణ త‌గ్గి పోయింది. అయినా హ‌రీష్ లాంటి క‌ళాత్మ‌క‌త ఉన్న వాళ్లు ఉన్నారు కాబ‌ట్టే ఇంకా ఈ క‌ళాకారులు బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌గ‌లుగుతున్నారు. స్టేజీ నాట‌కాల్లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న హ‌రీష్ కి డ్రామా బ‌తికి ఉండాల‌న్న త‌ప‌న ఉంది. అందుకే త‌న సినిమాల్లో స్టేజీ క‌ళాకారుల‌కు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తుంటారు.
Tags:    

Similar News