హరీష్ ఫీలింగ్స్ కి దాగుడు మూతల్లేవ్!

Update: 2018-07-18 13:33 GMT
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇద్దరు యువహీరోలతో ఒక మల్టీస్టారర్ ఉంటుందని 'డీజే- దువ్వాడ జగన్నాథం' సినిమా విడుదల తర్వాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే.  హరీష్ శంకర్ కూడా తన నెక్స్ట్ సినిమా 'దాగుడు మూతలు' కోసం లోకేషన్ల వేటలో ఉన్నానని అప్పట్లో అమెరికా నుండి కొన్ని ఫోటోలు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.  కానీ ఇప్పటికి ఆ ప్రకటన వచ్చి దాదాపు ఏడాది అయినా సినిమా మాత్రం పట్టాలెక్కలేదు.  

ఒక వారం క్రితం దిల్ రాజుకు హరీష్ శంకర్ కు స్క్రిప్ట్ విషయం లో అభిప్రాయభేదాలు వచ్చాయనీ.. దాంతో హరీష్ దిల్ రాజు కాంపౌండ్ నుండి బయటకు వచ్చి ఆ సినిమాను వేరే నిర్మాతతో చేసే ఆలోచనలో ఉన్నాడనే టాక్ కుడా వినిపించింది.  రీసెంట్ గా దిల్ రాజు బ్యానర్ నుండి రానున్న 5 సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం జరిగింది. అందులో కూడా 'దాగుడు మూతలు' లేదు.  ఆ 5 సినిమాల రిలీజ్ డేట్ లు ఇలా ఉన్నాయి.

1. లవర్‌ - జూలై 20 - 2018
2. శ్రీనివాసకల్యాణం - ఆగస్టు 9 - 2018
౩. హలోగురు ప్రేమకోసమే -అక్టోబర్‌ 18 - 2018
4.  ఎఫ్‌2 - జనవరి 12 - 2019
5. ఎస్‌ ఎస్‌ ఎంబీ25 - ఏప్రిల్‌ 5, 2019

దీనికి స్పందించిన హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఐదు సినిమాలకు బెస్ట్ విషెస్ తెలిపాడు. దాంతో పాటు తన ఫీలింగ్స్ ని కూడా ఏమాత్రం దాచుకోలేదు "నా సినిమాను ఈ లిస్టు లో మిస్సయ్యాను... అదోలా ఫీలవుతున్నాను... కానీ కొన్ని సార్లు తప్పవు.. ఆ అయిదు సినిమాలకు నా హృదయపూర్వక శుభాభినందనలు."   ఈ లెక్కన 'దాగుడు మూతలు' ఇక లేనట్టే అనుకోవచ్చు. దీంతో హారీష్ కూడా గట్టిగా ఫీలయినట్టున్నాడు!


Tags:    

Similar News