కులం ప్రస్థావనతో హరీశ్‌ షాకిచ్చాడు

Update: 2017-06-23 11:15 GMT
ఇవాళ రిలీజైన ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమాతో హరీశ్ శంకర్ మాంచి షాకులే ఇచ్చాడు. ముఖ్యంగా మనోడు సినిమాలో కులం గురించి ప్రస్థావించిన తీరు చూసి.. ఎవ్వరైనా కూడా షాక్ తినాల్సిందే. అనాల్సినవన్నీ అనేసి.. లాస్టులో కొన్నిసార్లు బటర్ పూసిన తరహాను కొన్ని సీన్లు ఉండటం కాస్త షాకిచ్చింది.

ఒకానొక సీన్లో.. తాము కమ్మ కులానికి చెందినవారమని.. తమ కూతురుని విజయవాడకు చెందిన బ్రాహ్మణులను అబ్బాయికి ఇవ్వాలంటే భయంగా ఉందంట.. యాంకర్ ఝాన్సీ చెబితే.. ''బెజవాడ అంటే.. కొండపైన అమ్మవారు.. క్రింద కమ్మవారు'' అంటూ అల్లు అర్జున్ ఒక పంచ్ పేల్చాడు. విజయవాడలో నిజంగానే కమ్మ కులానికి చెందిన లీడర్లు టాప్ పొజిషన్లో ఉండొచ్చు కాని.. నగరమంతా కమ్మవారే అంటే మాత్రం అంతగా ఒప్పుకోదగిన మాటగా అనిపించట్లేదు ఆ నగర వాసులకు. అదే విధంగా ఒక ప్రీ-క్లయమ్యాక్స్ సీన్లో.. 'పిల్లిని పంతుల్ని చంపకూడదని మా అమ్మ చెప్పింది' అంటూ బ్రాహ్మణులపైనే ఒక డైలాగ్ పేల్చాడు హరీశ్. ఈ మాట విలన్ .. మన హీరోతో అంటాడులే. కాకపోతే తరువాత బ్రాహ్మణ పురుషుడు అయిన బన్నీ తనని తాను ఒక పులితో పోల్చుకుంటాడు కాని.. ఎందుకో పిల్లి-పంతులు అనే ప్రస్తావన కాస్త ఇరకాటంలో పెడుతోంది.

నిజానికి కమ్మవారు డైలాగ్ కొట్టాక.. ఏదో ఆవిడను శాటిస్ఫై చేయడానికి చెప్పాను.. ఇంటర్ క్యాస్ట్ గురించి నాకంటే ఎక్కువ ఎవ్వరికీ తెలియదు అనే రీతిలో మనోడు మరో డైలాగుతో ఆయిన్టుమెంట్ రాయడానికి ప్రయత్నించినా.. అప్పటికే అదేదో చురకలా ఉంది. మరి ఇలాంటి డైలాగులను ఎందుకు ఎంచుకున్నాడో హరీశ్‌ కే తెలియాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News