PSPK 28 హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చేయలేదట...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లో 28వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడని డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పటికే ప్రకటించాడు. పవన్ - హరీష్ - దేవిశ్రీ కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై 8 ఏళ్ళైనా ఇంకా గబ్బర్ సింగ్ మానియా తగ్గలేదంటే అది ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీరి ముగ్గురి కలయికలో తెరకెక్కున్న PSPK 28 పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటించబోతోంది అనే ఆసక్తి అందరిలో ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చిత్రంలో మలయాళ హీరోయిన్ ను తీసుకున్నట్టు వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో అన్ని మీడియాలలో ఆమె ఫొటోస్ షేర్ అయ్యాయి.
అంతేకాకుండా పవన్ కల్యాణ్ సరసన మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ నటిస్తున్నట్టు మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. అయితే వీటిపై హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. తెలుగులోనే ప్రముఖ మీడియా సంస్థలు కూడా మలయాళ మానస రాధాకృష్ణన్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ అంటూ గాసిప్స్ రాయడంపై స్పందిస్తూ.. ''మనం ఫోన్ లో తరుచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం. పైగా నేను సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులోనే ఉంటాను.. మీరు కూడా గాసిప్స్ రాయడం ఊహించుకోలేకపోతున్నా'' అని ఓ ట్వీట్ చేశాడు. దీంతో మలయాళ హీరోయిన్ అని వచ్చిన వార్తలన్నీ పుకార్లే అని తేలిపోయింది. అంతేకాకుండా హరీష్ శంకర్ ఇప్పుడప్పుడే హీరోయిన్ గురించి ఆలోచించడం లేదంట. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉందట. పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో హరీష్ ఉన్నాడని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాతే సినిమా కాస్టింగ్ గురించి ఆలోచిస్తాడట.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాతే హరీష్ శంకర్ సినిమాని స్టార్ట్ చేస్తాడు. పవన్ - వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పింక్' రీమేక్ 'వకీల్ సాబ్' ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో దర్శకత్వంలో ఒక సీనియా చేయనున్నాడు. ఈ సినిమాని ఏయం రత్నం నిర్మించనున్నాడు. ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పీరియాడిక జానర్ లో తెరకెక్కుత్ను ఈ చ్రితంలో పవన్ క్యారక్టరైజేషన్ రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.