బండ్ల vs హరీష్ ఫైట్.. పెట్రోల్ పోసిన పీవీపీ
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ల మధ్య ట్వీట్ వార్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. మే 11తో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీ విడుదలై 8 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. చిత్ర యూనిట్ ను గుర్తు చేసుకొని ఒక లేఖను విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్, దేవీశ్రీప్రసాద్, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.
అయితే నిర్మాత బండ్ల గణేష్ పేరును దర్శకుడు హరీష్ శంకర్ విస్మరించాడు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని మరో ట్వీట్ లో బండ్ల గణేష్ గురించి ప్రస్తావించాడు. అయితే తనను మిస్ చేసిన హరీష్ శంకర్ పై బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. ‘హరీష్ కు తను అవకాశం ఇవ్వకుంటే ఇప్పుడు దర్శకుడయ్యేవాడు కాదు.. సినిమాలే లేవని’ హాట్ కామెంట్ చేశారు. హరీష్ పై నిప్పులు చెరిగాడు. దీనికి కౌంటర్ గా హరీష్ కూడా గట్టిగా కౌంటర్లు ఇచ్చాడు.
వీరిద్దరి వివాదం సోషల్ మీడియాలో సాగుతుండగానే తాజాగా ఈ వివాదంలోకి ప్రముఖ నిర్మాత/రాజకీయ నేత పీవీపీ కూడా ఎంటర్ అయ్యాడు. బండ్లను ఏకిపారేసిన పీవీపీ హరీష్ ను సపోర్టు చేస్తూ ట్వీట్ చేశారు.
‘బ్లేడ్ బాబు ( బండ్ల గణేష్) ఇకపై నీతో సినిమా తియ్యడట..వాడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు సినిమా తీయడానికి వెయింటింగ్.. తమ్ముడు స్టార్ట్ యూవర్ కుమ్ముడు’ అంటూ హరీష్ శంకర్ కు మద్దతుగా పీవీపీ ట్వీట్ చేశారు. ఇందులో బండ్లను దెప్పి పొడిచాడు.
దీనికి హరీష్ శంకర్ స్పందించాడు. ‘మీ భాష, భావం రెండూ నాకు అలరించాయి.. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి ‘ఫైటే’ అక్కర్లేదు. ‘ట్వీటే’ చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం.. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు సార్’ అంటూ ట్వీట్ చేశారు.
ఇలా బండ్ల గణేష్-హరీష్ శంకర్ సోషల్ మీడియా ఫైట్ లోకి పీవీపీ ఎంట్రీ ఇచ్చి మరింత పెట్రోల్ పోసి నిప్పును రాజేశారని చెప్పవచ్చు. ఈ ముగ్గురి ట్వీట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.