• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వీరమల్లు' కోసం మళ్లీ...

'వీరమల్లు' కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్న పవన్!

By - Tupaki Desk
Update: 2021-10-21 08:28 GMT
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ 'హరి హర వీరమల్లు'  సినిమాను రూపొందిస్తున్నాడు. ఇది మొగల్ చక్రవర్తుల పాలనా కాలానికి సంబంధించిన కథ. ఆ కాలంలో పేరు మోసిన ఒక వజ్రాల దొంగ కథ. సంపన్నులను దోచి పేదవాడికి పంచే రాబిన్ హుడ్ తరహా కథ. అలాంటి ఈ పాత్రను ఈ సినిమాలో పవన్ పోషిస్తున్నాడు. ఫస్టు లుక్ తోనే ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కావడంతో, అప్పటి కట్టడాలకు సంబంధించిన భారీ సెట్లను వేశారు. ఇందుకోసం నిర్మాత ఎ.ఎమ్. రత్నమ్ కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.

ఈ సినిమా 50 శాతం వరకూ షూటింగు జరిగిన తరువాత కరోనా తీవ్రత కారణంగా షూటింగు ఆపుకోవలసి వచ్చింది. ఆ సమయంలో పవన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆ తరువాత నుంచి పవన్ 'భీమ్లా నాయక్' షూటింగు పైనే పూర్తి దృష్టిపెట్టాడు. 'వీరమల్లు'తో పోలిస్తే ఇది చిన్న సినిమానే గనుక, ఈ సినిమాను పూర్తి చేసిన తరువాతనే వెళదామని పవన్ అనుకున్నాడు. అలా ఆయన చిత్రీకరణ పరంగా ఈ సినిమాను చివరిదశకు తీసుకొచ్చాడు. ఇక ఈ నెల 25వ తేదీ నుంచి 'వీరమల్లు' తాజా షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అర్జున్ రామ్ పాల్ .. జాక్విలెన్ ఫెర్నాండేజ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారని అంటున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందనీ, ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెడుతుందనే నమ్మకాన్ని క్రిష్ వ్యక్తం చేయడం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపించనుందని అంటున్నారు. ఆ మధ్య ఆమె పుట్టినరోజున వదిలిన పోస్టర్, కుర్రాళ్ల మనసులను కట్టిపడేసింది. ఇంతవరకూ నిధి అగర్వాల్ చేస్తూ వచ్చిన సినిమాల్లో, అత్యధిక బడ్జెతో నిర్మితమవుతున్న సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాపై ఈ సుందరి భారీ ఆశలే పెట్టుకుంది. వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఏ స్థాయి సంచలనానికి తెరతీస్తుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Tags:    
  • Pawan Kalyan 
  • Pawan Kalyan movies 
  • Pawan Kalyan bheemla nayak 
  • Pawan Kalyan pspk28 
  • hari hara veera mallu 
  • Janasena party 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS