బాహుబలి కంటే ఎక్కువ కష్టపడ్డ

Update: 2021-03-24 06:30 GMT
రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'అరణ్య' సినిమా దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో రాబోతున్న సినిమాపై అంచనాలు పెంచే విధంగా రానా సినిమాపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ అరణ్య సినిమా కోసం తాను పడ్డ కష్టాలు ఇబ్బందులను చెప్పుకొచ్చాడు. అటవి ప్రాంతంలో ఏనుగులతో జరిపిన షూటింగ్‌ సమయంలో చాలా కష్టపడ్డట్లుగా పేర్కొన్నాడు. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో రానా అడవి మనిషి తరహాలో కనిపిస్తున్నాడు. ఏనుగుల సంరక్షణ కోసం కార్పోరేట్‌ సంస్థలతో పోరాడే వ్యక్తి పాత్రలో రానా కనిపించబోతున్నాడు. రియల్‌ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన అరణ్య సినిమా కోసం బాహుబలి కోసం కంటే ఎక్కువ కష్టపడ్డట్లుగా రానా చెప్పుకొచ్చాడు.

జక్కన్న దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి' సినిమా కోసం రానా దాదాపుగా నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు. భల్లాలదేవుడి పాత్ర కోసం దాదాపుగా వంద కేజీల వరకు బరువు పెరిగాడు. పాత్ర రెండు వేరియేషన్స్‌ ను చూపించడం కోసం రానా లుక్‌ పరంగా చాలా కష్టపడ్డాడు అనే విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సినిమాకు మించి అరణ్య సినిమాకు కష్టపడ్డాను అంటూ రానా అనడం ఆశ్చర్యంగా ఉంది. అరణ్య సినిమా లో ఏనుగులతో ఉన్న సన్నివేశాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని రానా పదే పదే చెప్పుతున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.
Read more!

షూటింగ్‌ కు వారం ముందు నుండే ఏనుగులను మచ్చిక చేసుకునే వాడిని అని... నేను ఎప్పుడు వెళ్లినా కూడా జేబులో అరటి పండ్లు పెట్టుకుని ఏనుగుల వద్దకు వెళ్లేవాడిని అన్నాడు. ఒక సారి నా జేబులో ఉన్న అరటి పండ్ల కోసం ఒక్కసారిగా ఏనుగులు చుట్టు ముట్టాయి. ఆ సమయంలో చాలా భయపడ్డాను అంటూ రానా చెప్పుకొచ్చాడు. రానా లుక్‌ పరంగా ఇప్పటికే పాజిటివ్‌ మార్కులు దక్కించుకున్నాడు. ఎల్లుండి విడుదల కాబోతున్న సినిమాతో సక్సెస్‌ దక్కించుకోవడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News