• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంద్రగంటికి 'ఆ అమ్మాయి..'...

ఇంద్రగంటికి 'ఆ అమ్మాయి..' టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్..!

By - Tupaki Desk
Update: 2021-04-17 04:59 GMT
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు - డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'సమ్మోహనం' 'వి' సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ కోవిడ్ పరిస్థితుల మధ్య నిర్మాణం జరుపుకుంటోంది. నేడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక వీడియోతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేకింగ్ వీడియోలో ఇంద్రగంటి సెట్స్ లో తన టీమ్ కు డైరెక్షన్ ఇస్తూ కనిపిస్తున్నారు. దర్శకుడు - చిత్ర బృందం మధ్య మంచి సమన్వయం ఉండటంతో స్నేహపూర్వక వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు అర్థం అవుతోంది.

కాగా, 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ అద్భుతమైన ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో సుధీర్ బాబు సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. సుధీర్‌ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ మూవీ రూపొందుతోంది. బి.మహేంద్రబాబు - కిరణ్‌ బాలపల్లి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుధీర్ బాబు నటిస్తున్న ఈ 14వ చిత్రానికి పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చనున్నారు. స్సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - శ్రీకాంత్ అయ్యంగార్ - కల్యాణి నటరాజన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.Full View
Tags:    
  • Happy Birthday Mohanakrishna Indraganti 
  • Aa Ammayi 
  • Tollywood 
  • Sudheer Babu 
  • Telugu News 

Similar News

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS