తీగలా కొత్త అవతారంతో షాకిస్తోంది!
చక్కనమ్మ చిక్కినా అందమే అని భావించాలేమో హన్సిక మారిన రూపం చూస్తుంటే.. దశాబ్ధం పైగానే సౌత్ ఇండస్ట్రీస్ లో కథానాయికగా కెరీర్ ని నడిపించింది ఈ అమ్మడు. `దేశముదురు` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది మొదలు తెలుగు, తమిళ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అగ్ర కథానాయిక అన్న ఆ పేరు మినహా తన స్థాయి పెద్దదేనన్న ప్రశంసలు దక్కాయి. ఆ క్రమంలోనే ఈ బ్యూటీ కోలీవుడ్ కి వెళ్లిపోవడం, అక్కడ శింబుతో నిండా ప్రేమలో మునిగి, అటుపై ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పేయడం.. ఇదంతా చూస్తుంటే.. ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ గా కాలచక్రం గిర్రున తిరిగిపోయిందా అనిపించక మానదు. ప్రస్తుతం తమిళంలోనే నటిస్తూనే టాలీవుడ్ వైపు చూస్తోందిట.
అయితే ఇన్నేళ్ల కెరీర్ లో హన్సిక బొద్దుగానే కనిపించింది కానీ స్లిమ్ లుక్ లో మాత్రం దర్శనమివ్వలేదు. ఇటీవల కొంచెం బరువు తగ్గే ప్రయత్నంలో ఉందన్న ప్రచారం సాగింది. అయితే మరీ ఇంతగా సన్నజాజి తీగ రూపంతో షాకిస్తుందన్నది మాత్రం ఎవరూ ఊహించలేదు. స్టన్నింగ్ మేకోవర్ ఇది. బహుశా హన్సిక తన స్కూల్ - కాలేజ్ డేస్ నాటికి తిరిగి టైమ్ మెషీన్‌లో వెళ్లొచ్చిందా అనిపిస్తోంది. అంత స్లిమ్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఈ లుక్ చూశాక... బంగెన పల్లి మావిడిపండులా ముద్దొచ్చే ఈ అమ్మడు.. ఉన్నట్టుండి ఇలా చిలక్కొట్టిన జాంపండులా మారిపోతే యూత్ రిసీవింగ్ ఎలా ఉంటుందో? అన్న సందహాలు కలుగుతున్నాయి. తమిళ ఫ్యాన్స్ బొద్దుగా ఉంటే గుడి కట్టేస్తారు. అలాంటిది ఇలా సన్నజాజి తీగలా మారిపోతే కష్టమేనేమో! అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక హన్సికకు సంబంధించి ఇతర సంగతుల్ని పరిశీలిస్తే ఈ అమ్మడు సామాజిక సేవలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే 34 మంది అనాధల ఆలనాపాలనా చూస్తోంది. కన్న బిడ్డల కంటే ఎక్కువగా వీళ్లను తీర్చిదిద్దుతోంది. వీళ్లలో పదో తరగతి చదివే పిల్లాడు ఉన్నాడట. కెరీర్ పరంగా చూస్తే తమిళంలో `మహా` అనే చిత్రంలో నటిస్తోంది. ఇది తన కెరీర్ 50వ సినిమా. ఇదివరకూ ఈ సినిమా పోస్టర్ లో గంజాయి సేవిస్తూ ఇచ్చిన ఫోజు సోషల్ మీడియాలో జోరుగానే వైరల్ అయింది.