బ‌క్క చిక్కి ఝ‌డిపిస్తున్న‌ ఆపిల్ బ్యూటీ

Update: 2021-09-29 01:30 GMT
హ‌న్సిక ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్ ఇప్పుడు అభిమానులకు షాక్ నిస్తోంది. కెరీర్ ఆరంభంలో బ‌బ్లీ లుక్ లో ఆక‌ట్టుకుని ఆపిల్ బ్యూటీగా పాపుల‌రైన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల‌ ర‌క‌ర‌కాలుగా మేకోవ‌ర్ ట్రై చేస్తోంది. త‌న బ‌బ్లీ లుక్ ఆరంభం కోలీవుడ్ లోనే ఎక్కువ అవ‌కాశాల‌కు కార‌ణ‌మైంది. అమ్మ‌డు అక్క‌డ స్థిర‌ప‌డ‌టానికి లుక్ ఎంతగానో ఉప‌యోగ‌ప‌డింది. మ‌రీ అంత లావుగా లేక‌పోయినా ప‌ర్ పెక్ట్ సైజ్ తోనే అక్క‌డ లాంచ్ అవ్వ‌డం..అటుపై టాలీవుడ్ లోనూ క‌లిసొచ్చింది. అలా క‌శ్మీర్ ఆపిల్ బ్యూటీగా పేరుగాంచింది.  

అయితే కాల‌క్ర‌మేణా హ‌న్సిక శ‌రీరంలో ఊహించ‌ని మార్పులు భారీగానే చోటు చేసుకున్నాయి. ఒక్క‌సారిగా మ‌రింత‌గా ఒళ్లు చేసి ఓవ‌ర్ బ‌బ్లీలుక్ లో క‌నిపించింది. అయినా త‌మిళ తంబీలు ఆ లుక్ లో సైతం ఆద‌రించారు. కానీ తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయి.

స‌హ‌జంగా బబ్లీ  గాళ్స్ కి ఇక్క‌డ అంత క్రేజ్ ఉండ‌దు. ఆ ర‌కంగా హ‌న్సిక కొన్ని అవ‌కాశాల్ని కోల్పోయింది. అయితే ఇప్పుడు హీరోలంతా పాన్ ఇండియా కంటెంట్ ల‌పై దృష్టి పెట్ట‌డంతో! హ‌న్సిక కూడా ఆ ర‌కంగా త‌న‌మైండ్ సెట్ ని మార్చిన‌ట్లు కొన్ని స‌న్నివేశాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. తాజాగా హ‌న్సిక బ‌క్క చిక్కిన లుక్  ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. సైజ్ జీరో లుక్ లో త‌న కొత్త యాంగిల్ ని ప‌రిచ‌యం చేసింది. పైన  బ్లౌజు..బాటమ్ లో ధ‌రించిన ప్యాంట్ సైతం ప‌ర్ పెక్ట్ గా  స్కిన్ కి ఫిట్ కాలేదు. ఇక శ‌రీరంలో..ముఖంలో  మార్పులు కూడా స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. అమ్మ‌డు పూర్తిగా జీరో కోలెస్టిరాల్ బాడీతో క‌నిపిస్తోంది. ప్ర‌స్త‌తుం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఆపిల్ బ్యూటీని ఇలా చూసి పోల్చుకోవ‌డం కూడా క‌ష్టంగా మారింది. అన్న‌ట్టు  ఆపిల్ బ్యూటీని కొన్ని త‌మిళ చిత్రాల్లో దెయ్యం పాత్ర‌లో చూపించారు. రాజ్ మ‌హ‌ల్ .. క‌ళావ‌తి అంటూ హార‌ర్ థ్రిల్ల‌ర్ల‌లో భ‌య‌పెట్టింది. క‌ళావ‌తి తెలుగులో విడుద‌లై ఆక‌ట్టుకుంది. ఇప్పుడు అందుకు త‌గ్గ‌ట్టే మారిందంటూ పంచ్ లు ప‌డుతున్నాయి నెటిజ‌నుల్లో!

ప్ర‌స్తుతం  హ‌న్సిక కోలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది.  అలాగే తెలుగులోనూ రెండు చిత్రాల్లో న‌టిస్తోంది. `మై నేమ్ ఈజ్ శ్రుతి`.. `105 మినిట్స్` చిత్రాల్లో న‌టిస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ లు డిలే అవుతున్నాయి. సెట్స్ కు వెళ్లి కొన్ని నెల‌లు గ‌డుస్తున్నాయి. మ‌ధ్య‌లో క‌రోనా అడ్డు రావ‌డంతో షూటింగ్  బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు ఎలాంటి అప్ డేట్ కూడా బ‌య‌ట‌కు రాలేదు.
Tags:    

Similar News