ఐటెం హంసకు ఛాన్సిచ్చిన ఎన్టీఆర్

Update: 2017-03-24 06:09 GMT
ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించేసుకుని.. శరవేగంగా పిక్చరైజేషన్ కూడా జరుపుకుంటోంది. జై లవ కుశ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ మూవీలో.. యంగ్ టైగర్ మొదటిసారిగా మూడు రోల్స్ చేస్తుండగా.. ప్రస్తుతం హైద్రాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది.

కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. ఇప్పటికే రాశిఖన్నాను ఒక హీరోయిన్ గా ఎంపిక చేయగా.. మరో హీరోయన్ గా నివేదా థామన్ ను ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడీ సినిమాలో టాలీవుడ్ టాప్ ఐటెం బ్యూటీ హంసా నందిని నటించనుంది. ఇప్పటికే అగ్రిమెంట్స్ కూడా పూర్తి కావడంతో.. హంస యాక్టింగ్ ఖాయమైపోయినట్లే. అయితే.. సహజంగా ఐటెంసాంగ్స్ లో మాత్రమే కనిపించే ఈమె.. ఎన్టీఆర్ మూవీలో.. ఓ కేరక్టర్ చేసేందుకు సైన్ చేయడమే అసలైన స్పెషాలిటీ. ఈమె చేసే రోల్ కు  ఓ ఐటెం సాంగ్ ఉంటుందో లేదో మాత్రం ఇంకా తెలియదు కానీ.. ఎన్టీఆర్ మూవీలో కేరక్టర్ అనగానే.. వెంటనే ఒప్పేసుకుందని తెలుస్తోంది. మరి యంగ్ టైగర్ ఈమెతో ఏ టైపు కేరక్టర్ చేయించనున్నాడో చూడాలి.

గతంలో రామయ్యా వస్తావయ్యా మూవీలో కూడా ఎన్టీఆర్ తో కలిసి కనిపించింది ఈ హంస. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ సాధించిన ఊపులో ఉన్న సమయంలో ఎన్టీఆర్ మరో ఆఫర్ రావడాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది హంసా నందిని.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News