• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుక్కు నిర్మాణంలో 100...

సుక్కు నిర్మాణంలో 100 పర్సంట్ లవ్ రీమేక్

By - Tupaki Desk
Update: 2017-05-06 07:32 GMT
సుకుమార్ విలక్షణ దర్శకుడే కాదు.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కూడా. తెలుగులో తొలి సినిమా ‘కుమారి 21 ఎఫ్’తోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు సుక్కు. ఇప్పుడు అతడి ప్రొడక్షన్ లో ‘దర్శకుడు’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా రిలీజయ్యే లోపే సుక్కు నిర్మాతగా తన మూడో సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. కానీ ఆ సినిమా తెలుగులో కాదు.. తమిళంలో కావడం విశేషం. సుక్కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘100 పర్సంట్ లవ్’ను తమిళంలో రీమేక్ చేస్తుండటం.. దానికి సుకుమారే నిర్మాత కావడం విశేషం. చంద్రమౌళి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.

మ్యూజిక్ డైరెక్టర్ టర్న్ డ్ హీరో జి.వి.ప్రకాష్ కుమార్ ‘100 పర్సంట్ లవ్’ రీమేక్ లో హీరోగా నటిస్తున్నాడు అతడికి జోడీగా.. తమన్నా పాత్రను రీప్లేస్ చేసే అమ్మాయి ఎవరో ఇంకా డిసైడ్ చేయలేదు. చైల్డిష్ లుక్స్ ఉండే జి.వి.ప్రకాష్.. చైతూ చేసిన బాలు పాత్రకు సరిగ్గా సూటవుతాడని కోలీవుడ్ జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు ప్రకాషే సంగీతం కూడా అందిస్తాడు. చెన్నై ఎక్స్‌ ప్రెస్.. దిల్ వాలే లాంటి బాలీవుడ్ మెగా ప్రాజెక్టులకు ఛాయాగ్రహణం అందించిన డూడ్లీ ఈ సినిమాకు పని చేయబోతున్నాడు. పెట్టుబడి-లాభం కోణంలో చూస్తే సుక్కు కెరీర్లో ‘100 పర్సంట్ లవ్’ సినిమానే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. జగడం.. ఆర్య-2 లాంటి ఫ్లాపుల తర్వాత సుకుమార్ కు మళ్లీ సక్సెస్ అందించిన సినిమా ఇది. దీన్ని తెలుగులో అల్లు అరవింద్ నిర్మించాడు. మరి ఆయన దగ్గర రీమేక్ రైట్స్ ఎంతకు కొన్నాడో సుక్కు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • GV Prakash 
  • 100% Love Movie 
  • Telugu news 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS