బాహుబలి ఫస్ట్ షో టాక్: గ్రాఫిక్సున్నాయే...
సాధారణంగా మన తెలుగు సినిమాల్లో మేం గ్రాఫిక్స్ వాడాం అని చెప్పడానికే గ్రాఫిక్స్ వాడినట్లు అనిపిస్తుంటుంది. అదే హాలీవుడ్ సినిమాలను చూస్తే, వారు రియల్‌గా ఏది తీశారో ఏది గ్రాఫిక్స్‌లో తీశారో అనేది విడమరిచి చెప్పడం కూడా కష్టం. అయితే ఈసారి హాలీవుడ్ స్టాండర్డ్‌ను మ్యాచ్ చేశాడు రాజమౌళి. హైదరాబాద్‌కు చెందిన మకుటా, ఫైర్ ఫ్లయ్ స్టూడియోలతో కలసి మనోడు సృష్టించిన వాటర్‌ఫాల్స్, మాహిష్మతి రాజ్యం తాలూకు విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి.
సినిమాకు గ్రాండియర్ రావడానికి ముఖ్య కారణం విజువల్ ఎఫెక్ట్స్. బాహుబలిలో ఎక్కడా కూడా సదరు విజువల్ ఎఫెక్ట్స్ ఎబ్బెట్టుగా అనిపించవు. వాటర్‌ఫాల్స్ నుండి కత్తి యుద్దాల వరకు, పాటల నుండి మంచులో వచ్చే ఉపధృవం వరకు, కాలకేయం యుద్దం నుండి క్లయ్‌మ్యాక్స్ వరకు.. బాహుబలి సినిమాను తీయడానికి అసలు మనోళ్ళకు 3 సంవత్సరాలు ఎందుకు పట్టిందో మనకు చెప్పేలా ఉన్నాయి ఈ గ్రాఫిక్స్. ఏదో టెక్నికల్‌గా చూసేవారికి ఏదైనా బియ్యంలో రాళ్ళు దొరికినట్లు కొన్ని తప్పులు దొరకచ్చేమో కాని, సినిమాను ఎంజాయ్ చేసే కామన్ మ్యాన్‌కు మాత్రం ఈ గ్రాఫిక్స్ అద్భుతం. ఇప్పటివరకు వెండితెరమీద ఇలాంటి రియలిస్టిక్ గ్రాఫిక్స్ మనం చూడలేదంతే.