వకీల్ సాబ్ అవకాశం అనుకోకుండా దక్కింది: డైరెక్టర్ వేణుశ్రీరామ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత హీరోగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వకీల్ సాబ్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన టీజర్, పాటలు వకీల్ సాబ్ పై భారీ హైప్ క్రియేట్ చేసాయి. అయితే తాజాగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమా పై స్పందించాడు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా పవన్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేశామని వేణు చెప్పుకొచ్చాడు. అలాగే ఒరిజినల్ పింక్ మూవీ కోర్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపాడు. తాజాగా వకీల్ సాబ్ సినిమా అవకాశం ఎలా వచ్చిందనే విషయం పై వేణు స్పందించాడు.
వేణు మాట్లాడుతూ.. 'నిజానికి దిల్ రాజు నన్ను త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు పరిచయం చేసారు. త్రివిక్రమ్ గారు నన్ను పవన్ కళ్యాణ్ కు సిఫారసు చేశారు. వకీల్ సాబ్ సినిమాకు డైరెక్షన్ అనేది అనుకోకుండా వచ్చిన అవకాశం అని నేనంటాను. అదృష్టం కొద్దీ నాకు దక్కిందని నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఇక సినిమా పూర్తయ్యాక చూసి వకీల్ సాబ్ విషయంలో ఆనందంగా ఉన్నారు. నిజానికి హీరోగా పవన్ కళ్యాణ్ అనే బిగ్ స్టార్ ఉన్నాడు కాబట్టి నాకు అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. కానీ నేను అన్నివిధాలా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ముగ్గురు ఆడపిల్లల నేపథ్యం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మార్చ్ 29న ట్రైలర్ విడుదల కాబోతుంది.