ఆ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది

Update: 2017-05-27 09:28 GMT
గోపీచంద్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’కు మోక్షం లభించబోతోంది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇంకో రెండు వారాల్లో.. అంటే జూన్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలైన ఈ సినిమా.. అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదలయ్యే అవకాశమే లేదు అనుకుంటుండగా.. ఈ మధ్యే ఈ సినిమాకు టైటిల్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ పర్వాలేదనిపించింది. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ రూపొందించిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ.. స్టార్ రైటర్లు వక్కంతం వంశీ.. బి.వి.ఎస్.రవి.. ఇలా పోస్టర్ల మీద పెద్ద పెద్ద పేర్లే కనిపిస్తున్నాయి. వీళ్లందరూ కలిసి ప్రేక్షకుల్ని ఏమేరకు థియేటర్లకు రప్పిస్తారో చూడాలి.

భూపతి పాండ్యన్ అనే తమిళ దర్శకుడితో మొదలైన ఈ సినిమా.. తర్వాత గోపాల్ చేతికి వచ్చింది. మొదట ఈ సినిమాను మొదలుపెట్టిన నిర్మాతలు భగవాన్-పుల్లయ్య.. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును తాండ్ర రమేష్ చేతికి అప్పగించారు. జూన్ 9న ‘అమీతుమీ’.. ‘దర్శకుడు’ సినిమాలకు పోటీగా విడుదల కాబోతోంది ‘ఆరడుగుల బుల్లెట్’. మరి ఈ సినిమా గోపీ అండ్ టీంకు ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూద్దాం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News