18 వ‌య‌సు దాటితే వ్యాక్సిన్ వేయించాల‌న్న గ్లోబ‌ల్ ఐక‌న్

Update: 2021-04-27 10:46 GMT
భారతదేశంలో మహమ్మారి పరిస్థితి అదుపు లేకుండా పోతోంది. కేసులలో పెరుగుద‌ల అనూహ్యంగా ఉంది. మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తున్నట్లు భార‌త ప్ర‌భుత్వం ప్రకటించినప్పటి నుండి కోవిన్ లాగిన్స్ కోసం యూత్ అత్యావ‌శ్య‌కంగా వేచి చూస్తోంది. అనేక మంది ప్రముఖులు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్ర‌జ‌ల‌కు టీకాలు వేయమని అధికారుల్ని అడుగుతున్నారు. ఎందుకంటే COVID-19 ను నియంత్రణలోకి తీసుకురాగల ఏకైక మార్గం టీకాలు మాత్ర‌మే.

మీ వ్యాక్సిన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను ప‌లువురు సెల‌బ్రిటీలు కోరారు. టీకా గురించి అవగాహన కల్పించడానికి మాజీ ప్ర‌పంచ సుంద‌రి .. గ్లోబ‌ల్ ఐక‌న్ ప్రియాంక చోప్రా యునిసెఫ్ తో క‌లిసి ప్ర‌చారానికి దిగారు. టీకాలు సురక్షితం. సమర్థవంతంగా ప‌ని చేస్తున్నాయ‌ని వెంట‌నే టీకాలు వేయించుకోవాలని పీసీ ప్రజలను అభ్యర్థించారు. ఈ మహమ్మారిని అంతం చేసి సురక్షితమైన మార్గ‌మిది. ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించే ఏకైక మార్గం అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అమెరికా భారత్ లో ప‌రిస్థితి ఏమంత బాలేద‌ని అమెరికా ఓవైపు వ్యాక్సిన్స్ కోసం అర్జిస్తుంటే.. భార‌త‌దేశంలో క్రిటిక‌ల్ గా ఉంద‌ని కూడా పీసీ తాజా ట్వీట్  లో వ్యాఖ్యానించారు. అమెరికా 550 మిలియ‌న్ల అద‌న‌పు టీకా డోసులు కావాల‌ని ప్ర‌పంచాన్ని అర్థించిన‌ట్టు వెల్ల‌డించారు. ఆస్ట్రా జెన్ కా వ్యాక్సిన్ల‌ను యూకే నుంచి భార‌త్ కి పంపించాల‌ని కూడా పీసీ పిలుపునిచ్చారు.

45 వ‌య‌సు దాటిన వారికి ఇప్ప‌టివ‌ర‌కూ టీకాలు వేశారు. వారితో పాటు ఇక‌పై 18 వ‌య‌సు పైబ‌డిన అంద‌రికీ కోవీషీల్డ్ వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌నుంది. అందుకు వైద్య అధికారుల‌తో క‌లిసి ఆరోగ్య శాఖ స‌మాయ‌త్త‌మ‌వుతోంది. రేప‌టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగనుంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్ర‌జ‌ల్లో అప్ర‌మ‌త్త‌త పెరుగుతోంది. ప్రియాంక చోప్రా స‌హా ప‌లువురు స్టార్ల ప్ర‌చారంతో ఇప్ప‌టికే టీకాపై అవ‌గాహ‌న పెరిగింది. ఇక టీకా వేశాక క‌రోనా రాదు అనే అపోహ వ‌ద్దు. వ‌చ్చినా దాంతో పోరాడే శ‌క్తిని ఇచ్చేదే టీకా అని వైద్యులు చెబుతున్నారు. యాంటీబాడీల ఉత్ప‌త్తి కోసం టీకా త‌ప్ప‌నిస‌రి. టీకా రెండు డోసులు వేశాక బ‌లం పుంజుకుంటారు. ఆ త‌ర్వాతా య‌థావిధిగా కోవిడ్ నియ‌మాల్ని ఉల్లంఘించ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి.
Tags:    

Similar News