రౌడిగారి మొదటి రోజు ధంధా అదిరిందోచ్

Update: 2018-08-16 10:07 GMT
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' నిన్నే రిలీజ్ అయింది.  మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  క్రేజ్- హైప్ - టాక్ కి తగ్గట్టే మోదటి రోజు విజయ్ సినిమా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది.  మొదటి రోజె దాదాపు రూ. 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలలో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

నాని 'MCA'.. సాయి ధరమ తేజ్ 'విన్నర్' సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ ను 'గీత గోవిందం' దాటడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో 8.5 కోట్లు - అమెరికా లో 4.24 కోట్లు - కర్ణాటక 1.32 కోట్ల రెస్ట్ ఆఫ్ వరల్డ్ 2.21 కోట్లతో టోటల్ 16 కోట్ల గ్రాస్ సాధించింది.  షేర్ అయితే రూ. 9.71 కోట్లు. 

ఇక ఏరియా వైజ్ షేర్స్ చూద్దాం.  అన్నీ రూపాయలే.

నైజాం             1.60 cr
సీడెడ్             1.05 cr
ఉత్తరాంధ్ర         0.56 cr
ఈస్ట్               0.47 cr
వెస్ట్               0.45 cr
కృష్ణ               0.47 cr
గుంటూరు         0.60 cr
నెల్లూరు           0.24 cr

కర్ణాటక            0.61 cr
అమెరికా          2.35 cr
రెస్ట్ ఆఫ్ వరల్డ్    0.96 cr

Total             9.71 కోట్లు
Tags:    

Similar News