• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గీతా ఆర్ట్స్ వారి మలయాళ...

గీతా ఆర్ట్స్ వారి మలయాళ రీమేక్ అటకెక్కిందా..?

By - Tupaki Desk
Update: 2021-12-16 00:30 GMT
మలయాళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన సూపర్ హిట్ ''నాయట్టు'' సినిమాను గీతా ఆర్ట్స్ వారు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఇటీవలే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకుంటుండగా.. ఇప్పుడు ఈ రీమేక్ పనులు ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.  

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - విద్యా మాధురి ఈ రీమేక్ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో అంజలి - ప్రియదర్శి - రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు వెల్లడించారు. మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ - ఎడిటర్ నవీన్ నూలి - సినిమాటోగ్రాఫర్ అరుళ్ విన్సెన్ట్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాలో భాగం అవుతున్నట్లు పేర్కొన్నారు.

అయితే రీమేక్ హక్కుల విష‌యంలో గీతా ఆర్ట్స్‌ కి మ‌లయాళ‌ నిర్మాత‌ల‌కూ మ‌ధ్య విభేదాలు రావడంతో 'నాయ‌ట్టు' రీమేక్ ను ప‌క్క‌న పెట్టేశార‌ని టాక్‌ నడుస్తోంది. దీంతో ఇప్పటికే రీమేక్ స్క్రిప్ట్ ని రెడీ చేసిన డైరెక్టర్ క‌రుణ కుమార్ తదుపరి సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒకవేళ రీమేక్ రైట్స్ విషయంలో సమస్యలు తొలగిపోయినా గీతా వారు ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.  

'నాయట్టు' చిత్రంలో నాయకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం వ్యవస్థలను, అధికారాన్ని చేతిలో పెట్టుకుని సామాన్యులను ఎలాంటి వేధింపులకు గురి చేస్తారు.. పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి సొంత పోలీసులను ఎలా బలిపశువులను చేశారనే అంశాలను చూపించారు. వాస్తవికతకు దగ్గరగా మంచి కాన్సెప్ట్ తో ఉండే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి కనబరిచారు.

కానీ ఇప్పుడేమో అసలు ఈ రీమేక్ మీద నిర్మాతలు ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌డం లేదని టాక్ వచ్చింది. ఇదే కనుక నిజమైతే, రీమేక్ హ‌క్కులు చేతులు మారి మళ్ళీ ఈ సినిమా మొదలవుతుందేమో చూడాలి.
Tags:    
  • Nayattu 
  • palasa 1978 
  • Karuna Kumar 
  • Anjali 
  • Priyadarshi 
  • Rao Ramesh 
  • Allu Arvind 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS