మహేష్ కొడుక్కి అక్కడేం పని..?

Update: 2016-05-14 11:53 GMT
మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ చివరికి హీరోనే అవుతాడని అందరికీ తెలుసు కానీ.. ఈ చిన్న వయసులో అందరికీ ఉండేలాగే అతడికి కూడా క్రికెట్ అంటే మహా పిచ్చిలాగుంది. ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్ కోసం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు హైదరాబాద్ కు వస్తే వాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఓ విందులో సడెన్ గా గౌతమ్ ప్రత్యక్షమయ్యాడు.

డేర్ డెవిల్స్ ఓపెనర్ అయిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్.. ప్రపంచకప్ ఫైనల్లో సిక్సర్ల మోత మోగించిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్.. భారత యువ ఆటగాడు కరుణ్ నాయర్ లాంటి వాళ్లతో ఎంతో ముచ్చటపడి ఫొటోలు దిగాడు గౌతమ్. మనోడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలిసి ఆ ఆటగాళ్లు కూడా గౌతమ్ ను దగ్గరికి తీసుకుని ఫొటోలు దిగారు.

తాహిర్ లాంటి వాళ్లు గౌతమ్ ను పక్కన కూర్చోబెట్టుకుని అతడి వివరాలు తెలుసుకున్నారు. గౌతమ్ కు క్రికెట్ అంటే బాగానే ఆసక్తి ఉంది. అప్పుడప్పుడూ ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఉప్పల్ స్టేడియానికి కూడా వస్తుంటాడు. భవిష్యత్తులో అతను అఖిల్ మాదిరిగా సీసీఎల్ మ్యాచుల్లో తెలుగు టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లేకపోలేదు.
Tags:    

Similar News