• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుమ్మడి కాయ కొట్టేసిన...

గుమ్మడి కాయ కొట్టేసిన మెగా హీరో

By - Tupaki Desk
Update: 2021-10-21 10:55 GMT
మెగా హీరో వరుణ్‌ తేజ్ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న గని సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆలస్యం అయ్యింది. లేదంటే గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. సాయి మంజ్రేకర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తో అల్లు వారి పెద్దబ్బాయి బాబీ పూర్తి స్థాయి నిర్మాతగా పరిచయం అవ్వబోతున్నాడు. సిద్దు తో కలిసి బాబీ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం అంతర్జాతీయ ఛాంపియన్స్ ఆధ్వర్యంలో వరుణ్‌ తేజ్ ట్రైనింగ్‌ తీసుకున్న విషయం తెల్సిందే. అందుకోసం భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగింది. సినిమాలోని బాక్సింగ్ సన్నివేశాలు మంచి స్పందన దక్కించుకుంటాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ కరోనా వల్ల బ్రేక్ ల మీద బ్రేక్ లు తీసుకుని ముగించారు. ఎట్టకేలకు చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌ మినహా షూటింగ్‌ మొత్తంగా పూర్తి చేశామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే డిసెంబర్‌ లో 3వ తారీకున విడుదల చేయాలని నిర్ణయించారు. వరుణ్‌ తేజ్ లుక్‌ తో పాటు ఇటీవలే విడుదలైన ఫస్ట్‌ పంచ్‌ వీడియో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకునేలా దర్శకుడు తెరకెక్కించాడనే నమ్మకంను మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఈమద్య కాలంలో మెగా హీరోల సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటున్నాయి కనుక గని సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్‌ అవ్వడం ఖాయం అని మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. సినిమాలోని పలు సన్నివేశాలు మరియు ముఖ్యంగా బాక్సింగ్‌ పోటీలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో షూటింగ్ ను ముగించినట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ను ముగించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఇక నిర్మాణానంతర కార్యక్రమాలపై పడబోతున్నారు. నవంబర్ రెండవ లేదా మూడవ వారం వరకు ఫస్ట్‌ కాపీ సిద్దం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Tags:    
  • Gani 
  • Varun Tej 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

Copyright @2026

Powered by Blink CMS